Vishwambhara : ‘విశ్వంభర’లో హైలైట్ సీన్ ఇదేనట..!!
Vishwambhara : ఈ మూవీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది
- By Sudheer Published Date - 12:04 PM, Wed - 12 February 25

చిరంజీవి (Chiranjeevi) హీరోగా మల్లిడి వశిష్ఠ (Mallidi Vassishta) కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిరు 156 మూవీ ‘విశ్వంభర’ (Vishwambhara). సోషియో ఫాంటసీ మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా చిరుతో ఓ సాంగ్‌ను చిత్రీకరించనున్నారట. ఓ భారీ సెట్లో 600 మంది డ్యాన్సర్లతో చిరు స్టెప్పులు వెయ్యనున్నట్లు టాక్. శోభా మాస్టర్ ఆ పాటకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.
Delhi CM Race: ఢిల్లీ సీఎంగా యోగి లాంటి లీడర్.. ఎందుకు ?
ఇదిలా ఉండగా ఈ మూవీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ సీక్వెన్స్‌ను సుమారు 26 రోజుల పాటు షూట్ చేశారట. ఇక 54 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని కూడా మూవీ టీమ్ ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం ముందే సీక్వెన్స్ షూటింగ్ జరిగింది. గతంలో దీనికి సంబంధించిన ఫొటోలు సైతం వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. మరి ఈ సీక్వెన్స్ వెండితెరపై ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఈ మూవీ లో త్రిష, అషికా రంగనాథ్, మృణాల్ ఠాకూర్, కునాల్ కపూర్, జాన్వీ కపూర్ కీలక పాత్రలు పోషించనున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీ తర్వాత చిరంజీవి ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో ఓ చిత్రం , అనిల్ రావిపూడి డైరెక్షన్లో మరో సినిమా చేయనున్నాడు.