Viswak Sen: విశ్వక్ సేన్ సంచలన నిర్ణయం.. శభాష్ అంటున్న నెటిజన్స్
- Author : Balu J
Date : 16-06-2024 - 9:54 IST
Published By : Hashtagu Telugu Desk
Viswak Sen: యువ నటుడు విశ్వక్ సేన్…తన అవయవాలను దానం చేస్తానని ప్రకటించారు. మరణాంతరం అవయవాలను దానం చేయడం వల్ల ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపవచ్చని విశ్వక్ సేన్ అన్నారు. హైదరాబాద్ అమీర్ పేట మెట్రో స్టేషన్ లో ప్రముఖ అవయవదాన స్వచ్ఛంద సంస్థ……”మెట్రో రెట్రో” పేరుతో 27వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు శైలేష్ కొలనుతో పాటు ముఖ్య అతిథిగా విశ్వక్ సేన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తన అవయవాలను దానం చేస్తున్నట్లు విశ్వక్ ప్రకటించారు. అనంతరం పలువురు ప్రముఖులు ర్యాంప్ వాక్ చేస్తూ ప్రజలకు అవయవదానంపై అవగాహన కల్పించారు.
చనిపోయాక మనిషి తన శరీరంలోంచి 200 అవయవాలు, కణజాలాన్ని దానం చేయవచ్చు. కళ్ళు, గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, క్లోమం, పెద్ద పేగు, చిన్నపేగులు, ఎముకలు, మూలుగను దానం చేయవచ్చు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత సగటున ఆరేడుగురికి జీవితం ఇవ్వొచ్చు. అయితే విశ్వక్ నిర్ణయం పట్ల నెటిజన్స్ శభాష్ అంటున్నారు.