Row Over Ginna: జిన్నాపై రాజకీయ దుమారం!
తిరుమల ఏడుకొండల నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం 'జిన్నా' అనే టైటిల్ కు రాజకీయ సెగ తగిలింది.
- Author : Balu J
Date : 13-06-2022 - 12:24 IST
Published By : Hashtagu Telugu Desk
తిరుమల ఏడుకొండల నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జిన్నా’ అనే టైటిల్ కు రాజకీయ సెగ తగిలింది. దీంతో ఆ సినిమాపై కాంట్రావర్సీ నెలకొంది. మంచు విష్ణు నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. దీనిపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడు మంచు విష్ణు లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న వ్యక్తి పేరును ఎలా టైటిల్ పెడుతారని ఆందోళన వ్యక్తం చేశాడు. అయితే, ఈ చిత్రానికి, దాని టైటిల్‌కు జిన్నాతో సంబంధం లేదని చిత్ర నిర్మాత స్పష్టం చేశారు. ఈ చిత్రంలో జి నాగేశ్వరరావు ప్రధాన పాత్రను విష్ణు పోషించినందున దీనికి ‘జిన్నా’ అని పేరు పెట్టారు. నాగేశ్వరరావు పాత్ర తన పూర్తి పేరు జి నాగేశ్వరరావుతో సరిపోదని, అందుకే దానిని జిన్నాగా మార్చుకున్నానని చెప్పారు. ఈ పేరును బీజేపీ నేతలు తప్పుగా అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు.
Ginna Movie: మంచు విష్ణు సినిమాపై బీజేపీ అభ్యంతరం https://t.co/7MRXExY49D
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) June 12, 2022