Manchu Lakshmi: కెమెరాకు అడొచ్చాడని మంచు లక్ష్మి సీరియస్, నెట్టింట్లో వీడియో వైరల్
నిత్యం ప్రైవేట్ కార్యక్రమాలు, ఫంక్షన్లకు హాజరయ్యే మంచు లక్ష్మీకి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది.
- Author : Balu J
Date : 21-09-2023 - 5:04 IST
Published By : Hashtagu Telugu Desk
SIIMA అవార్డ్స్ లో మంచు లక్ష్మి ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వేడుకలో ఆమె మీడియాతో మాట్లాడుతుండగా.. కొందరు కెమెరాకు అడ్డుగా వచ్చారు. దీంతో ఆమె ఆగ్రహానికి లోనై వారిపై సీరియస్ అయ్యారు. ఓ వ్యక్తిపై చెయ్యి చేసుకోగా.. మరో వ్యక్తిని కెమెరా వెనుక నుంచి వెళ్లాలి డ్యూడ్ అంటూ కోప్పడ్డారు. దీంతో ప్రతిష్టాత్మక అవార్డ్స్ వేడుకలో ఇలా చేయడం ఏంటని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
ప్రముఖ తెలుగు నటి లక్ష్మి మంచు దుబాయ్‌లో ఇటీవల ముగిసిన సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్)లో పాల్గొంది. అయితే లక్ష్మి మంచు మీడియాతో ఇంటరాక్ట్ అవుతుండగా, కెమెరా ముందు నడిచినందుకు ఒక వ్యక్తిని కొట్టడం, మరొక వ్యక్తిపై కేకలు వేయడం జరిగింది. ఈ ద్రుశ్యాలు వీడియోలో చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “కెమెరా వెనుక వెళ్ళండి, డ్యూడ్. బేసిక్” మంచు లక్ష్మీ కేకలు వేయడం వీడియోలో స్పష్టంగా చూడొచ్చు. అయితే లక్ష్మి మంచు ప్రతి సంవత్సరం SIIMA షోకి రెగ్యులర్ అటెండ్ అవుతోంది.
Manchu Lakshmi 😂😂pic.twitter.com/xjk0TfJ4ey
— Milagro Movies (@MilagroMovies) September 21, 2023
Also Read: KTR: అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం అందిస్తాం: మంత్రి కేటీఆర్