Vikram Director: రజనీతో మూవీ అంటే అంత ఈజీ కాదు..!!
కమల్ హాసన్ కెరియర్లో ఎన్నో విజయాలు...మరెన్నో మైలురాళ్లు. ప్రయోగాల పరంగా ఆయన్ను మించిన నటుడు మరొకరు లేరు.
- By hashtagu Published Date - 07:35 PM, Fri - 12 August 22
కమల్ హాసన్ కెరియర్లో ఎన్నో విజయాలు…మరెన్నో మైలురాళ్లు. ప్రయోగాల పరంగా ఆయన్ను మించిన నటుడు మరొకరు లేరు. సక్సెస్ పరంగా చూసుకున్నట్లయితే…విక్రమ్ మూవీ ఒక ఎత్తుగా కనిపిస్తుంది. రిలీజైన ప్రతి ప్రాంతంలో ఈ మూవీ మంచి సక్సెస్ ను సొంతం చేసుకుంది. వసూళ్ల పరంగానూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన ఈ మూవీకి దర్శకుడు లోకేశ్ కనగరాజ్.
కమల్ హాసన్ కు ఆ స్థాయి సక్సెస్ ఇచ్చిన లోకేశ్…సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూడా మూవీ చేయనున్నట్లు గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో…ఈ విషయంపై లోకేష్ స్పందించారు. రజనీ సార్ తో మూవీ అంటే మాటలా….మార్కెట్ పరంగా…క్రేజ్ పరంగా రజనీ సార్ కు తగిన స్టోరీ సిద్ధం చేయడం అంత ఈజీ కాదు అన్నాడు.
రజనీతో మూవీ చేయాలన్నది నా కల. ఆయనతో చేసే సినిమా ఎలా ఉండానే విషయంలో నాకు ఒక క్లారిటీ ఉంది. దానికి తగ్గట్లుగానే ఒక లైన్ను సిద్ధం చేశారు. అది తప్పకుండా రజనీకాంత్ సార్ కు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఆయనతో తప్పకుండా మూవీ చేస్తానన్న నమ్మకం నాకు ఉందంటూ చెప్పుకొచ్చాడు లోకేశ్.
Related News
Thug Life: కమల్, మణిరత్నం మూవీపై భారీ అంచనాలు.. ‘థగ్ లైఫ్’ రిలీజ్ ఎప్పుడంటే!
Thug Life: లెజెండ్స్ కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో చాలా ఏళ్ల తర్వాత తెరకెక్కుతున్న చిత్రం ‘థగ్ లైఫ్’. ఈ ప్రాజెక్టుకు విపరీతమైన హైప్ వస్తున్నా కమల్ పొలిటికల్ కమిట్మెంట్స్ కారణంగా చాలా ఆలస్యమవుతోంది. షెడ్యూల్ విభేదాల కారణంగా జయం రవి, దుల్కర్ సల్మాన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని పలు వార్తలు వచ్చాయి. దుల్కర్ పోషించాల్సిన పాత్రను శింబు చేయనున్నట్లు సమాచారం. ప్రస్త�