HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Vijay Will Do A Mind Blowing Movie With Dil Raju

దిల్ రాజుతో మైండ్ బ్లోయింగ్ సినిమా చేస్తా : విజయ్ దేవరకొండ

దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్, ఆదిత్య మ్యూజిక్ అసోసియేష‌న్‌తో ... శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’.

  • Author : Balu J Date : 22-10-2021 - 5:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్, ఆదిత్య మ్యూజిక్ అసోసియేష‌న్‌తో … శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచిగా త‌గిన‌ట్లు ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు ఆశిష్‌(శిరీష్ త‌న‌యుడు). బుధవారం ఈ సినిమా నుంచి ‘ప్రేమే ఆకాశం..’ అనే పాట‌ను విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ సాంగ్‌ను లాంచ్ చేశారు. ఈ సంద‌ర్భంగా విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడారు.

‘‘డైరెక్టర్ ఆశిష్‌, అనుప‌మ‌, డైరెక్ట‌ర్ శ్రీహ‌ర్ష‌కు నాకు ప‌రిచయం ఉంది. వీరి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న రౌడీ బాయ్స్ సినిమాలోని సాంగ్ లాంచ్ చేయ‌డం హ్యాపీగా ఉంది. పెళ్లిచూపులు ముందు నుంచి శ్రీహ‌ర్ష నాకు తెలుసు. హుషారు క‌థ నాకు ముందే చెప్పాడు. యూత్ మీట‌ర్ ప‌ర్పెక్ట్‌గా తెలిసిన ద‌ర్శ‌కుడు. అందుకు ఈ సినిమా అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంద‌ని తెలుసు. దిల్‌రాజుగారు, శిరీష్‌గారు సామాన్య‌మైన వ్య‌క్తులు కాదు. వాళ్లు గ‌ర్వ‌ప‌డేలా ఆశిష్ సినిమా చేస్తే చాలు. వాళ్లు గ‌ర్వ‌ప‌డేలా గొప్ప న‌టుడిగా ఎద‌గాల‌ని కోరుకుంటున్నాను. నిజానికి దిల్‌రాజుగారు, శిరీష్‌గారు అస‌లు రౌడీ బాయ్స్. ఎందుకంటే ఎక్క‌డో నిజామాబాద్ నుంచి ఇక్క‌డ‌కు వ‌చ్చి సినీ ఇండ‌స్ట్రీలో స్థిర‌ప‌డ్డారు. రాజుగారితో మైండ్ బ్లోయింగ్ సినిమా చేయాల‌ని వెయిట్ చేస్తున్నాను. త్వ‌ర‌లోనే అనౌన్స్ చేస్తాం. న‌వంబ‌ర్ 19న రౌడీ బాయ్స్ విడుద‌ల‌వుతుంది’’ అన్నారు.

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘‘రౌడీ బాయ్స్‌’ ప‌క్కా యూత్ కంటెంట్ మూవీ. ఆల్ రెడీ ఫ‌స్ట్ సాంగ్‌, టీజ‌ర్ చూశారు. సినిమా కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే సినిమా. ఇందులో ల‌వ్ కంటెంట్ ఎలా ఉంటుంద‌నేది సినిమా చూడాల్సిందే. యూత్‌ఫుల్ మూవీ కావ‌డంతో దీనికి రౌడీ బాయ్స్ అనే టైటిల్ పెట్టాం. విజ‌య్‌తో నాకు డిఫ‌రెంట్ జ‌ర్నీ ఉంది. కేరింత సినిమాకు ముగ్గురు హీరోల్లో ఒక‌రిగా న‌టించ‌డానికి విజ‌య్ దేవ‌ర‌కొండ ఫొటో షూట్‌కు వ‌స్తే, అలా చూసేసి వెళ్లిపోయాను. త‌న‌ను క‌ల‌వ‌లేదు. అలాగే పెళ్లిచూపులు సినిమాను కూడా నాకు చూపించాల‌ని త‌ను ప్ర‌య‌త్నిస్తే నేను ఆస్ట్రేలియాలో హాలీడేస్‌లో ఉన్నాను. తర్వాత త‌ను అర్జున్ రెడ్డితో ఓ క‌ల్ట్ స‌క్సెస్ సాధించాడు. గీతా గోవిందం స‌క్సెస్ త‌ర్వాత ఈవెంట్‌కు వెళ్లిన నేను అక్క‌డకు విజ‌య్ వ‌స్తుంటే వ‌స్తున్న రెస్పాన్స్ చూసి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారికి ఫ్యాన్స్ దొరికారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లా తెలుగు ఇండ‌స్ట్రీకి ఓ యూత్‌ఫుల్ స్టార్ దొరికాడ‌ని అన్నారు. హీరో ఆశిష్ మాట్లాడుతూ ‘‘బిజీగా ఉన్న‌ప్ప‌టికీ మా కోసం వ‌చ్చి సాంగ్ లాంచ్ చేసిన విజ‌య‌న్న‌కు థాంక్స్‌. లైగ‌ర్ కోసం మేమందరం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాం. అనుప‌మ పెద్ద స్టార్ అయినా ఎంత‌గానో స‌పోర్ట్ చేసిందన్నారు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ మాట్లాడుతూ ‘‘మమ్మల్ని ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. అలాగే విజ‌య్ దేవ‌ర‌కొండగారికి స్పెష‌ల్ థాంక్స్‌. ఈ కార్య‌క్ర‌మంలో తేజ్ కొర్ర‌పాటి, కార్తీక్ ర‌త్నం, ప్ర‌ణీత్‌, కోమ‌లి, ర‌చ్చ ర‌వి త‌దిత‌రులు పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anupama Parameswaran
  • dil raju
  • rowdy
  • vijay devarakonda

Related News

Vijay Rashmika Sangeet

Rashmika – Vijay Sangeet : సంగీత్ లో డాన్స్ తో ఇరగదీసిన రష్మిక-విజయ్

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం గతనెల 26న ఉదయపూర్‌లో అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటూ, తాజాగా సంగీత్ వేడుకకు సంబంధించిన ఫొటోలు

  • Rashmikavijay

    విజయ్ గుండెలపై సేద తీరుతున్న రష్మిక..ఫ్యాన్స్ ఫిదా !!

Latest News

  • ముంబై వాంఖ‌డే పిచ్‌.. క్యూరేటర్‌పై గంభీర్ అస‌హ‌నం?!

  • భార‌త మార్కెట్‌లో అత్యంత చౌకైన బైక్ ఇదే!

  • ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి తుది వీడ్కోలు.. ఖ‌న‌నం ఎక్క‌డంటే?

  • మనం తీసుకునే ఆహారంలో గోధుమ‌లే డేంజ‌రా?!

  • ఎంఎస్ ధోనీకి షాక్ ఇచ్చిన పోలీసులు!

Trending News

    • రెండు వేల రూపాయ‌ల నోట్లు ఇంకా ఎందుకు బయట ఉన్నాయి?

    • రేపే భార‌త్‌- ఇంగ్లాండ్ సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌.. ఈ ఆట‌గాళ్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

    • ఇరాన్‌ లో ఓ వైపు యుద్ధం, మరోవైపు భూకంపం

    • శబరిమలలో మహిళలకు నో ఎంట్రీ

    • ఖమేనీ వద్ద ఎంత ఆస్తి ఉందో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd