Vijay Thalapathy: విజయ్ దళపతి క్రేజ్.. 8 నెలలకు ముందే బెనిఫిట్ షో టికెట్స్!
టైటిల్ అనౌన్స్ మెంట్ టీజర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అప్పుడే బుకింగ్స్ (Bookings) మొదలుపెట్టేశారు.
- Author : Balu J
Date : 04-02-2023 - 3:56 IST
Published By : Hashtagu Telugu Desk
రెండు వారాల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ (Advance Booking) ఓపెన్ చేయడం, టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోవడం సర్వసాధారణం. కానీ సినిమా నిర్మాణం పూర్తిగా మొదలుకాకుండా, అసలు రిలీజ్ డేట్ ఎప్పుడో తెలియకుండా ఫ్యాన్స్ అసోసియేషన్లు టికెట్లు కొనడం మాత్రం ఖచ్చితంగా ఎనిమిదో వింతే. విజయ్ (Vijay Thalapathy) అభిమానులు మేము స్పెషల్ అని ప్రూవ్ చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ తో ఇతను ప్రస్తుతం లియో చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న వచ్చిన టైటిల్ అనౌన్స్ మెంట్ టీజర్ సోషల్ మీడియాలో బాగానే హల్ చల్ చేస్తోంది. అప్పుడే దీనికి బుకింగ్స్ (Bookings) మొదలుపెట్టేశారు.
కేరళలోని (Kerala) అలపుజ్జా జిల్లా కేంద్రంలో లియో పేరుని ప్రకటించడానికి కొన్ని గంటల ముందే బెనిఫిట్ షో టికెట్లు అమ్మకానికి పెడితే క్షణాల్లో అవి సోల్డ్ అవుట్ అయిపోయాయి. దీపావళి విడుదల ఎలాగూ కన్ఫర్మ్ చేశారు కానీ తేదీ క్లారిటీ లేకపోయినా ఫలానా సీజన్ అని తెలిసిపోయింది కాబట్టి ముందస్తు ఏర్పాటు అన్న మాట. దీని ప్రకారం అలపుజ్జాలో మొదటి ఆట ఏ టైంకు పడినా దాని తాలూకు టికెట్లకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుందట. ధర వెయ్యి నుంచి రెండు వేల రూపాయల మధ్యలో పలికినట్టు టాక్. ఇది కొంచెం అతిశయోక్తిగా అనిపించినా తమిళ హీరోల (Vijay Thalapathy) మీద పిచ్చి ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి ఇది సాక్ష్యం.
టాలీవుడ్లో మరీ ఇంత విపరీత స్థాయిలో లేకపోవడం సంతోషమే అయినా ట్విట్టర్ (Twitter) వేదికగా పరస్పరం బురద జల్లుకునే యాంటీ ఫ్యాన్స్ కి మన దగ్గరా కొదవ లేదు. కాకపోతే నెలల ముందే డబ్బులు ఖర్చు పెట్టుకుని టికెట్లు కొనాల్సిన అవసరం పడలేదు. అయినా ఉదయాన్నే షోలు వేసేందుకు తగినన్ని థియేటర్లు ఉండగా ఇప్పుడే ఇంత అత్యుత్సాహం ఎందుకు చూపిస్తున్నారంటే అజిత్ కంటే తమ హీరో (Vijay Thalapathy) అన్నింటిలోనూ ఓ మెట్టు పైన ఉన్నాడని చెప్పుకునే తాపత్రయంలా కనిపిస్తోంది. ఇటీవలే వారసుడు తెగింపులతో తలపెడితే ఏరియాలను బట్టి ఇద్దరూ సమానంగానే ఆధిపత్యం చెలాయించారు.
Also Read: Vani Jayaram: బ్రేకింగ్.. సింగర్ వాణి జయరాం మృతి!