Vani Jayaram: బ్రేకింగ్.. సింగర్ వాణి జయరాం మృతి!
కళా తపస్వి కె. విశ్వనాథ్ చనిపోయిన వార్త మరువ ముందే, మరో విషాద వార్త వినాల్సి వచ్చింది
- Author : Balu J
Date : 04-02-2023 - 3:00 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ (Tollwood) లో మరో విషాదం చోటుచేసుకుంది. కళా తపస్వి కె. విశ్వనాథ్ చనిపోయిన వార్త మరువకముందే, మరో విషాద వార్త వినాల్సి వచ్చింది. ఓ అద్భుత స్వరం మూగబోయింది. ప్రముఖ గాయని వాణీ (Vani Jayaram) జయరాం కన్నుమూశారు. శనివారం మధ్యాహ్నం వాణి జయరాం హఠాన్మరణం చిత్ర పరిశ్రమని శోకసంద్రంలో ముంచేసింది. వాణీ జయరామ్ వయసు 78 ఏళ్ళు. చెన్నై (Chennai) లోని నాగంబాక్కంలో గల హద్డౌస్ రోడ్డులోని స్వగృహంలో కన్ను మూశారు. తలకు గాయం కావడంతో ఆమె మరణించినట్లు (Death) ప్రాధమిక సమాచారం అందుతోంది. దీంతో ఆమె మృతి మిస్టరీగా మారింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో వేల పాటలు పాడిన వాణి జయరాం మరణంతో ఇండియన్ సినిమానే తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతుంది.
అవార్డు అందుకోకుండానే
వాణీ జయరామ్ (Vani Jayaram) చిత్రసీమకు చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఇటీవల గణతంత్ర దినోత్సవం రోజున పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. దేశంలోని మూడో అత్యున్నత పురస్కారంతో ఆమెను సత్కరించింది. అయితే ఆ అవార్డు అందుకోక ముందు ఆవిడ కన్ను మూయడం విషాదమని అభిమానులు, ప్రేక్షకులు విలపిస్తున్నారు.
జాతీయ పురస్కారాలు
వాణీ జయరామ్ ఉత్తమ గాయనిగా మూడు సార్లు జాతీయ పురస్కారం అందుకున్నారు. కె. బాలచందర్ దర్శకత్వం వహించిన ‘అపూర్వ రాగంగాళ్’ సినిమా (తెలుగులో ‘అంతులేని కథ’)లో పాటలకు గాను ఒకసారి జాతీయ పురస్కారం అందుకున్నారు. మిగతా రెండు సార్లు కె. విశ్వనాథ్ సినిమాల్లో పాటలు అందుకోవడం విశేషం. ‘శంకరాభరణం’లో పాటలకు 1980లో, ఆ తర్వాత ‘స్వాతి కిరణం’ సినిమాలో ‘ఆనతినీయరా హరా…’ పాటకు 1991లో మరోసారి వాణీ జయరామ్ (Vani Jayaram) జాతీయ పురస్కారం అందుకున్నారు. ఆమె ఇప్పటివరకు 14 భాషల్లో 20 వేల వరకు పాటలు పాడారు.
Also Read: Prabhas Car Collection: ప్రభాస్ గ్యారేజ్.. ఇచ్చట అన్ని రకాల కార్లు ఉండబడును!