Shamshabad Airport : ఎయిర్ పోర్ట్ లో చిక్కుకుపోయిన విజయ్ దేవరకొండ
Shamshabad Airport : హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్(Hyderabad Shamshabad Airport)లో ఓ విమాన సమస్య కారణంగా గందరగోళం నెలకొంది
- By Sudheer Published Date - 07:16 PM, Fri - 7 February 25

సినీ ప్రముఖులు విమానయాన సంస్థలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న సంఘటనలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్(Hyderabad Shamshabad Airport)లో ఓ విమాన సమస్య కారణంగా గందరగోళం నెలకొంది. ప్రయాగ్‌రాజ్(Prayagraj)కు వెళ్లాల్సిన విమానం సాంకేతిక లోపం కారణంగా ఆలస్యమవడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విమానంలో ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఉండడంతో ఆయన అభిమానులు టెన్షన్‌కు గురయ్యారు.
Delhi : కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ అధికారులు..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో పాల్గొనేందుకు విజయ్ దేవరకొండ బయలుదేరాడు. ఈరోజు ఉదయం తల్లి గౌతమితో కలిసి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. కానీ సాంకేతిక లోపం కారణంగా విమానం ఇంకా టేక్‌ఆఫ్ కాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కుంభమేళా జనవరి 13న ప్రారంభమై ఇప్పటివరకు 40 కోట్ల మందికి పైగా భక్తులు పవిత్ర గంగానదిలో స్నానం ఆచరించారు. మహా కుంభమేళా ఫిబ్రవరి 27న మహాశివరాత్రితో ముగియనుంది. 45 రోజుల పాటు జరిగే ఈ మహా ఉత్సవానికి దేశం నలుమూలల నుంచి భక్తులు, రాజకీయ, సినీ ప్రముఖులు తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ కూడా పుణ్యస్నానాల కోసం ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అయితే, కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో వరుస ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే మహా కుంభమేళాలో తొక్కిసలాట కారణంగా 30 మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా, 60 మంది గాయపడ్డారు.