Vijay Devarakonda : శ్యామ్ సింగ రాయ్ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ..!
Vijay Devarakonda రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం పరశురాం డైరెక్షన్ లో ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ
- By Ramesh Published Date - 08:25 PM, Fri - 20 October 23

Vijay Devarakonda రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం పరశురాం డైరెక్షన్ లో ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ ఈ సినిమా తర్వాత జెర్సీ డైరెక్టర్ గౌతం తిన్ననూరితో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో వస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత మరో క్రేజీ కాంబో సెట్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. తనకు టాక్సీవాలా హిట్ ఇచ్చిన డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ తో విజయ్ సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తుంది.
టాక్సీవాలా తర్వాత నాని (Nani)తో శ్యామ్ సింగ రాయ్ (Shyam Singha Roy) సినిమా చేశాడు రాహుల్. ఆ సినిమాతో కూడా తన డైరెక్షన్ టాలెంట్ ఏంటన్నది ప్రూవ్ చేసుకున్నాడు. శ్యామ్ సింగ రాయ్ తర్వాత మరో అద్భుతమైన కథ సిద్ధం చేసేందుకు టైం తీసుకున్న రాహుల్ ఫైనల్ గా విజయ్ దేవరకొండ కోసం పర్ఫెక్ట్ కథ రాసుకున్నాడట. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ (Mytri Movie Makers) నిర్మిస్తారని తెలుస్తుంది.
Also Read : BiggBoss 7 : శివాజీ ఎమోషనల్.. నా వల్ల కావడం లేదంటూ..!
మైత్రి మూవీ మేకర్స్ తో 3 సినిమాల అగ్రిమెంట్ చేసుకున్న విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ (Dear Comrade), ఖుషి సినిమాలు చేశాడు ఇప్పుడు రాహుల్ సంకృత్యన్ తో సినిమా లాక్ చేశాడు. ఈ సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.
ఫ్యామిలీ స్టార్ (Family Star) గా సంక్రాంతికి సినిమాను తెస్తున్న విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి సినిమాతో కూడా నేషనల్ లెవెల్ లో సత్తా చాటాలని ఫిక్స్ అయ్యాడు. లైగర్ తర్వాత తన సినిమాల ప్లానింగ్ తో ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్న విజయ్ రాబోయే సినిమాలతో అదరగొడతాడని అనిపిస్తుంది.