Vijay Devarakonda : విజయ్ పట్టుకుంది ఎవరి చెయ్యి..? కీలక ప్రకటన పెళ్లి గురించేనా..?
రెండు చేతులు ఉన్నాయి. ఓ చెయ్యి ఆయనది ..మరో చెయ్యి ఎవరిదీ? అనేది మీ ఉహలకే.. ఆ ఫోటోకి విజయ్ దేవరకొండ ఇచ్చిన కాప్షన్.
- By Sudheer Published Date - 09:50 PM, Tue - 29 August 23

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)..ఈ పేరు చెపితే చాలు యూత్ లో కిక్ వస్తుంది. అర్జున్ రెడ్డి (Arjun Reddy) మూవీ తో యూత్ స్టార్ గా మారిన విజయ్..ఆ తర్వాత గీత గోవిందం (Geetha Govindam) మూవీ తో ఫ్యామిలీ హీరోగా మారాడు. పరుశురాం డైరెక్షన్లో రష్మిక – విజయ్ (Vijay Devarakonda – Rashmika) జంటగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా విజయ్ – రష్మిక కెమిస్ట్రీ (vijay Devarakonda – Rashmika Chemistry) సినిమాకు ప్రాణం పోసింది. ఈ చిత్రం తర్వాత విజయ్ – రష్మిక గురించి అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇద్దరు ప్రేమలో (vijay Devarakonda – Rashmika Love) ఉన్నారని ..త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని..అందుకే ఇద్దరు కలిసి ఫారెన్ టూర్స్ కు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారని మాట్లాడుకుంటూ వస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా విజయ్..సోషల్ మీడియా పేజీ లో పోస్ట్ చేసిన ఓ పిక్… రష్మిక – విజయ్ ప్రేమ వార్తలకు మరింత బలం చేకూర్చేలా చేస్తుంది. విజయ్ పోస్ట్ చేసిన పిక్ లో ‘రెండు చేతులు ఉన్నాయి. ఓ చెయ్యి ఆయనది ..మరో చెయ్యి ఎవరిదీ? అనేది మీ ఉహలకే.. ఆ ఫోటోకి విజయ్ దేవరకొండ ఇచ్చిన కాప్షన్..జీవితంలో చాలా జరుగుతున్నాయి. అయితే, ఇది మాత్రం చాలా స్పెషల్.. త్వరలో అనౌన్స్ చేస్తా” అని పేర్కొన్నారు. దాంతో ఆయన ప్రేమ, పెళ్లికి సంబంధించిన కబురు చెప్పబోతున్నారని అభిమానులు , నెటిజన్లు మాట్లాడుకోవడం స్టార్ట్ చేసారు. విజయ్ పోస్ట్ చేసిన పిక్ లో ఓ చెయ్యి విజయ్ ది..మరో చెయ్యి రష్మికదే అని నెటిజన్లు అంటున్నారు. రష్మిక తో ప్రేమ వ్యవహారం గురించి ఇలా చెప్పకనే చెప్పాడు విజయ్..త్వరలోనే పెళ్లి కబురు వినబోతున్నాం అంటూ వారికీ వారే కామెంట్స్ చేసుకుంటున్నారు. మరి నిజంగా ఆ చెయ్యి రశ్మికదేనా..లేక మరొకరిదా అనేది చూడాలి.
Read Also : Rajinikanth : కండక్టర్ గా పనిచేసిన బస్ డిపో ను సందర్శించిన రజనీకాంత్..
ఎందుకంటే ప్రస్తుతం విజయ్..సమంత తో కలిసి ఖుషి (Kushi) మూవీ చేసాడు. ప్రేమ పెళ్లి, పెళ్లి తర్వాత భార్యభర్తల మధ్య కలహాలు నేపథ్యంలో ఈ చిత్రాన్ని శివ నిర్వాణ (Shiva Nirvana) తెరకెక్కించారు. ఈ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా తాలూకా సాంగ్స్ , ట్రైలర్ , టీజర్ , ప్రమోషన్ కార్యక్రమాలు ఇలా అన్ని కూడా సినిమా ఫై అంచనాలు పెంచాయి. విజయ్ సైతం తనదైన స్టయిల్ లో ప్రమోషన్ చేస్తున్నాడు. మొన్నటికి మొన్న అర్ధరాత్రి సమంత కు వీడియో కాల్ చేసినట్లు తెలిపాడు. ఇక ఇప్పుడు సినిమా ప్రమోషన్ లో భాగంగానే ఇలా చెయ్యి పట్టుకున్న పిక్ పెట్టి ఉండొచ్చని కూడా అనుకోవచ్చు. ఏది ఏమైనప్పటికి విజయ్ పోస్ట్ చేసిన పిక్ మాత్రం అందర్నీ ఆలోచనలో పడేస్తుంది.