Vijay Devarakonda Family Star Teaser : ఫ్యామిలీ స్టార్ టీజర్.. దేవరకొండ ఈసారి పర్ఫెక్ట్ ప్లాన్ తో దిగుతున్నాడుగా..!
Vijay Devarakonda Family Star Teaser విజయ్ దేవరకొండ పరశురాం కాంబినేషన్ లో గీతా గోవిందం లాంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న
- By Ramesh Published Date - 10:23 PM, Mon - 4 March 24

Vijay Devarakonda Family Star Teaser విజయ్ దేవరకొండ పరశురాం కాంబినేషన్ లో గీతా గోవిందం లాంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ లాక్ చేయగా సినిమా నుంచి లేటెస్ట్ గా టీజర్ రిలీజ్ చేశారు. సినిమా నుంచి ఫస్ట్ వచ్చిన ఐరనే వంచాలా ఏంటి గ్లింప్స్ సినిమాపై క్రేజ్ తీసుకు రాగా లేటెస్ట్ గా వచ్చిన టీజర్ సినిమాపై హైప్ తెచ్చింది.
ఫ్యామిలీ మెన్ గా తన బాధ్యతలు నిర్వహిస్తూనే ఆ ఫ్యామిలీకి కష్టం వస్తే ఎదురు నిలబడి పోరాడే వ్యక్తిగా హీరో కనిపిస్తున్నాడు. చివర్లో హీరోయిన్ లిఫ్ట్ అడిగినా సరే పెట్రోల్ కొట్టించమని అడిగాడంటే అతని లెక్కల గురించి తెలుస్తుంది.
ఖుషి తర్వాత విజయ్ దేవరకొండ చేస్తున్న ఈ సినిమా నుంచి వచ్చిన ఈ టీజర్ సినిమాపై హైప్ తీసుకొచ్చింది. గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా ఇంప్రెస్ చేసేలా ఉంది. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.