Vijay Devarakonda : ఇప్పటికీ అడ్జస్ట్ అవుతా.. విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
Vijay Devarakonda జీవితంలో అడ్జెస్ట్మెంట్ అనేది కామన్ లైఫ్ లో అందరు ఎక్కడో ఒక చోట అడ్జెస్ట్ అవుతుంటారని చెబుతున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. రీసెంట్ గా ఒక ఈవెంట్ లో పాల్గొన్న విజయ్ దేవరకొండ
- By Ramesh Published Date - 07:08 PM, Tue - 26 March 24
Vijay Devarakonda జీవితంలో అడ్జెస్ట్మెంట్ అనేది కామన్ లైఫ్ లో అందరు ఎక్కడో ఒక చోట అడ్జెస్ట్ అవుతుంటారని చెబుతున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. రీసెంట్ గా ఒక ఈవెంట్ లో పాల్గొన్న విజయ్ దేవరకొండ చిన్నప్పుడు ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా చాలా విషయాల్లో అడ్జెస్ట్ అయ్యానని చెప్పాడు. తన తండ్రిని సైకిల్ అడిగితే బర్త్ డేకి అది మిస్ అయితే సెలవుల్లో ఇలా పోస్ట్ పోన్ చేస్తుండే వారని.. టీవీ, వీడియో గేం ఇలా అన్నిటిలో కూడా అడ్జెస్ట్ అవుతూ వచ్చానని అన్నారు.
లైఫ్ లో అందరు అడ్జెస్ట్ అవ్వాలని.. ఇప్పుడు పరిస్థితి బాగుంది కానీ తను కూడా చిన్నప్పుడు చాలా వాటికి అడ్జెస్ట్ అయ్యానని చెప్పాడు విజయ్ దేవరకొండ. హీరోగా తన ఇమేజ్ పెరిగినా తను పెరిగిన పరిస్థితుల గురించి దేవరకొండ హీరో మర్చిపోలేదని తన మాటలని బట్టి అర్ధమవుతుంది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ లాక్ చేశారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను పరశురాం డైరెక్ట్ చేస్తున్నారు. గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో నుంచ్ రిలీజైన 3 సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి.
Also Read : Samantha : అక్కడే ఫోకస్ చేస్తున్న సమంత.. ఎందుకు అలా ఫిక్స్ అయ్యింది..?