Venkatesh : నాన్ RRR రికార్డులను బద్ధలు కొట్టిన వెంకటేష్..!
- By Ramesh Published Date - 11:29 PM, Sun - 19 January 25

విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతికి రిలీజై సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. రోజు రొజుకి ఈ సినిమా వసూళ్లు సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. ఈ సినిమా ఐదో రోజు నాన్ ఆర్.ఆర్.ఆర్ రికార్డులను బ్రేక్ చేసింది. RRR సినిమా ఐదో రోజు 13 కోట్లు కలెక్ట్ చేయగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా 12 కోట్ల పైన రాబట్టింది.
ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత డే 5 అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్స్ తో అదరగొట్టేస్తుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటించారు.
ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా సినిమా చూసేందుకు..
ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రాం చరణ్ కలిసి నటించారు. కానీ సంక్రాంతికి వస్తున్నం సినిమాలో వెంకటేష్ సోలో హీరో అయినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా సినిమా చూసేందుకు థియేటర్ బాట పడుతున్నారు. సంక్రాంతికి ష్యూర్ షాట్ హిట్ బొమ్మగా ఈ సినిమా నిలిచింది.
వెంకటేష్ సినిమా హిట్ పడితే ఎలా ఉంటుందో సంకాంతికి వస్తున్నాం సినిమా చూపించింది. ఈ సినిమా సీక్వెల్ కూడా ఉండే ఛాన్స్ ఉందని డైరెటర్ అనిల్ రావిపూడి హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సీక్వెల్ డీటైల్స్ చెప్పలేదు కానీ అనౌన్స్ చేసి ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెరిగింది. మరి అనిల్ ఈసారి ఎలాంటి కథతో వస్తాడో చూడాలి.