Venkatesh Saindhav : వెంకటేష్ సైంధవ్ ని ఓటీటీలో తెస్తున్నారా..? సినిమా ఇక్కడ ఏమవుతుందో..!
Venkatesh Saindhav విక్టరీ వెంకటేష్ శైలేష్ కొలను కాంబినేషన్ లో వచ్చిన మూవీ సైంధవ్. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకట్ బోయినపల్లి ఈ సినిమా నిర్మించారు.
- By Ramesh Published Date - 09:09 PM, Mon - 22 January 24
Venkatesh Saindhav విక్టరీ వెంకటేష్ శైలేష్ కొలను కాంబినేషన్ లో వచ్చిన మూవీ సైంధవ్. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకట్ బోయినపల్లి ఈ సినిమా నిర్మించారు. శ్రద్ధ శ్రీనాథ్, ఆండ్రియా, రుహాని శర్మ నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నవాజుద్ధీన్ సిద్ధుఖీ విలన్ గా చేశారు. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా ఆడియన్స్ ని అలరించడంలో విఫలమైంది. సినిమా కోసం వెంకటేష్ పడిన కష్టమంతా కూడా వృధా అయ్యింది.
We’re now on WhatsApp : Click to Join
అయితే ఈ సినిమా థియేట్రికల్ వెర్షన్ ఫ్లాప్ అవ్వగా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాను అమేజాన్ ప్రైం ఫ్యాన్సీ ధరకే కొనేసింది. అయితే సినిమా హిట్ అయితే నెల రోజుల దాకా రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ థియేట్రికల్ వెర్షన్ హిట్ అవ్వలేదు కాబట్టి సైంధవ్ సినిమాను త్వరగానే ఓటీటీలోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. వెంకటేష్ సైంధవ్ సినిమా ఫిబ్రవరి మొదటి వారం లో డిజిటల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.
హిట్ 1, 2 సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకున్న శైలేష్ థర్డ్ అటెంప్ట్ గా సైంధవ్ చేశాడు. అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో అతను అనుకున్నది ఒకటైతే రిజల్ట్ వేరేలా వచ్చింది. సినిమా రిలీజ్ తర్వాత వచ్చిన రివ్యూస్ గురించి డైరెక్టర్ శైలేష్ అప్సెట్ అవుతూ బ్యాడ్ రివ్యూస్ బుడ్ సినిమాను ఏమి చేయవు అంటూ కామెంట్స్ కూడా చేశాడు. కానీ ఆడియన్స్ కూడా సైంధవ్ సినిమాకు అదే రిజల్ట్ ఇచ్చారు. థియేటర్ లో ఆడియన్స్ ని అలరించలేని సైంధవ్ ఓటీటీలో అయినా ప్రేక్షకులను అలరిస్తుందో లేదో చూడాలి.