IT Rides : దిల్ రాజు ఆఫీస్ లపై ఐటీ దాడులు..వెంకీ రియాక్షన్ ఇది..!
IT Rides : సంక్రాంతికి వస్తున్నాం మూవీ సక్సెస్ మీట్లో వెంకీ మాట్లాడుతూ.. తనకు ఈ సోదాల విషయం తెలియదని చెపితే
- By Sudheer Published Date - 02:19 PM, Thu - 23 January 25

గత మూడు రోజులుగా ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) ఇళ్లలో , ఆఫీస్ లలో ఐటీ దాడులు (IT Rides) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ దాడులపై హీరో వెంకటేష్ స్పందించారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ సక్సెస్ మీట్లో వెంకీ మాట్లాడుతూ.. తనకు ఈ సోదాల విషయం తెలియదని చెపితే , దిల్ రాజుపైనే కాదు, పలువురు ప్రముఖులపై ఈ సోదాలు జరుగుతున్నాయని డైరెక్టర్ అనిల్ ( Anil Ravipudi Reacts) వెల్లడించారు.
వెంకటేష్ – అనిల్ రావిపూడి – దిల్ రాజు కలయికలో సంక్రాంతి బరిలో సంక్రాంతికి వస్తున్నాం మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తో పాటు గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలు వచ్చినప్పటికీ వాటిని పక్కకు నెట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల వద్ద బారులు తీరుతున్నారు. ఎన్నో ఏళ్లుగా థియేటర్ మొహం చూడని వారు సైతం ఈసారి సంక్రాంతి సినిమాను థియేటర్‌లో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఎక్కడ చూడు థియేటర్లు అన్ని ఫ్యామిలీ ఆడియన్స్‌తో కిటకిటలాడుతున్నాయి. ఈ దెబ్బకు బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. కేవలం వారం రోజుల్లోనే రూ.200 కోట్లు కలెక్ట్ చేసి వార్తల్లో నిలిచింది. ఈ మూవీ కి వస్తున్న కలెక్షన్స్ , గేమ్ ఛేంజర్ సినిమాను భారీ నిర్మాణం తో దిల్ రాజు నిర్మించడం ఇవన్నింటితో ఐటీ అధికారులు లెక్కలు తేల్చే పనిలో పడ్డారు. మూడు రోజులుగా సోదాలు జరుపుతూ వస్తున్నారు.
Pistachio: పిస్తా పప్పు ప్రతి రోజు తింటే ఏం జరుగుతుందో, ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?
ఇదే క్రమంలో నేడు చిత్ర యూనిట్ బాక్సాఫీస్ సంభవం పేరుతో సక్సెస్ మీట్ నిర్వహించింది. హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి(Venkatesh, Anil Ravipudi )తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దిల్ రాజు రాకపోయేసరికి మీడియా వారు అడిగారు. దానికి సమాధానంగా అనిల్ మాట్లాడుతూ మంచి సినిమా ఇంత విజయం సాధించాక దాన్ని జనంలోకి తీసుకెళ్లడం చాలా అవసరమని రాజుగారు చెప్పారు కాబట్టే ఇవి కొనసాగిస్తున్నామని, అన్ని పరిశ్రమల్లోలాగే ఆదాయపు పన్ను దాడులు ప్రతి రెండు మూడు సంవత్సరాలకు జరుగుతుంటాయని, ఇది సహజమని తేల్చి చెప్పారు. దిల్ రాజు ఎలాంటి బాధలో లేరని కుండబద్దలు తేల్చి చెప్పారు. ఎవరెవరి ద్వారానో కాకుండా నేరుగా తామే సక్సెస్ ని పంచుకోవాలని ఇక్కడికి వచ్చామని అన్నారు.
ఇదిలా ఉంటె దిల్ రాజు తల్లి అస్వస్థతకు గురయ్యారు. రాజు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న తరుణంలోనే ఆమె అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆమెను ఐటీ శాఖ వాహనంలోనే తీసుకెళ్లగా కుటుంబ సభ్యులతో పాటు మహిళా అధికారిణిని వెంట పంపించారని తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికి ఐటీ రైడ్స్ అనేది ప్రస్తుతం చిత్రసీమలో హాట్ టాపిక్ గా మారింది.