Pistachio: పిస్తా పప్పు ప్రతి రోజు తింటే ఏం జరుగుతుందో, ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?
డ్రై ఫ్రూట్స్ లో పిస్తా పప్పు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అని,పిస్తా పప్పు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 01:17 PM, Thu - 23 January 25

డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన పిస్తా వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. డ్రై ఫ్రూట్స్ లో పిస్తా పప్పు కి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇవి తినడానికి కాస్త ఉప్పగా ఉండి చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు కూడా పిస్తా పప్పును ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. పిస్తా పప్పు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందట. అయితే రోజుకి ఐదు నుంచి ఆరు పిస్తా పప్పులు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందట. ఇంకా రుచి సంగతి పక్కన పెడితే పిస్తా పప్పులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పిస్తా పప్పు పోషకాల గని అని చెప్పవచ్చు. వీటిని క్రమంగా తప్పుకుంటే తింటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
చలికాలంలో పిస్తా పప్పు తినడం ఆరోగ్యానికి మంచిదీ అంటున్నారు. ఇకపోతే పిస్తా పప్పు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే.. పిస్తా పప్పులో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. మెగ్నిషియం, కాపర్, జింక్, ఫైబర్, కాల్షియం, పొటాషియం, విటమిన్ బీ6, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు వంటి ఎన్నో ఖనిజాలు, మినరల్స్ లభిస్తాయి. వీటిని తింటే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందట. అంతేకాకుండా మెదడు పని తీరు కూడా మెరగవుతుందట. పిల్లల్లో జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని చెబుతున్నారు. మోనోశాచురేటెడ్, పాలీఅన్ సాచురేటెట్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు పిస్తా పప్పులో ఉంటాయి.
ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయట. పిస్తా పప్పులను రోజూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందట. పిస్తా పప్పులో మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయట. ఇవి గుండెకు ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. ఈ ఆరోగ్య కొవ్వులు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయట. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయట. గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుందట. పిస్తాపప్పులు గుండె జబ్బుల్ని నివారిస్తాయని,రక్తపోటు కూడా కంట్రోల్‌లో ఉంటుందని చెబుతున్నారు. డయాబెటిస్ పేషెంట్లకు పిస్తా పప్పు ఎంతో మేలు చేస్తుంది. పిస్తాపప్పు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థిరంగా ఉంటుంది. ఇందులో అధిక ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ఇది శరీరంలో చక్కెర శోషణను తగ్గిస్తుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి సమతుల్యంగా ఉంటుంది. అలాగే ఇది టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందట. పిస్తా పప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గిస్తాయట. అందుకే రోజూ పిస్తా పప్పు తీసుకోవాలని చెబుతున్నారు.