Hari Hara Veeramallu : మే 9 వీరమల్లు రావడం పక్క ..?
Hari Hara Veeramallu : ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో అనుకున్న సమయానికి సినిమా వస్తుందా? లేక వాయిదా పడుతుందా? అనే అనుమానాలు అభిమానుల్లో ఉత్కంఠ రేపుతున్నాయి
- Author : Sudheer
Date : 02-04-2025 - 5:00 IST
Published By : Hashtagu Telugu Desk
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తున్న “హరిహర వీరమల్లు” (Hari Hara Veeramallu) చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మే 9న విడుదల కానుందని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పటివరకు విడుదలైన టీజర్లు, పాటలు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ ప్యాన్ ఇండియా స్థాయిలో అంతగా హైప్ రాలేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో అనుకున్న సమయానికి సినిమా వస్తుందా? లేక వాయిదా పడుతుందా? అనే అనుమానాలు అభిమానుల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం సినిమా విడుదలలో ఎటువంటి ఆలస్యం లేకుండా హరిహర వీరమల్లు అనుకున్న సమయానికే థియేటర్లలో సందడి చేయనున్నాడు.
Garbage Cess : ప్రజలపై ‘చెత్త’ పన్ను భారం వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రస్తుతం సినిమా చివరి షెడ్యూల్ ఏప్రిల్ 7 నుంచి 14 వరకు ప్లాన్ చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ కేవలం నాలుగు రోజుల పాటు మాత్రమే షూటింగ్ చేయాల్సి ఉంది. అందుకే ఇది పెద్ద సమస్య కాదని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇప్పటికే కథానాయకుడికి సంబంధించిన మేజర్ పార్ట్ పూర్తయిపోయింది. దర్శకుడు జ్యోతి కృష్ణ హీరో అవసరం లేని కీలక సన్నివేశాలను కూడా షూట్ చేసేశారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో టీమ్ పూర్తిగా బిజీగా ఉంది. విఎఫ్ఎక్స్ వర్క్ కోసం విదేశీ కంపెనీలు పనిచేస్తుండగా, ఫైనల్ ఎడిట్ త్వరలో సిద్ధం కానుంది. నిర్మాత ఏఎం రత్నం ఏప్రిల్ చివరి వారంలో సెన్సార్ పనులు ముగించాలని భావిస్తున్నారు.
Houses : ఏపీలో వారందరికీ ఇళ్ల స్థలాలు – మంత్రి కీలక ప్రకటన
“హరిహర వీరమల్లు” సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ ఉంది. సీక్వెల్ కోసం కొన్ని కీలక సన్నివేశాలు ఇప్పటికే చిత్రీకరించినట్లు సమాచారం. అయితే రెండో భాగం షూటింగ్ వేగంగా జరగాలంటే మొదటి భాగం ఎంత మేరకు విజయం సాధిస్తుందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఔరంగజేబ్ పాత్రలో నటించగా, ఎంఎం కీరవాణి సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.