HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Veerabhadra Movie Review

Surya వీరభద్రుడు మూవీ రివ్యూ

  • Author : Vamsi Chowdary Korata Date : 16-05-2026 - 10:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Veerabhadra Movie Review
Veerabhadra Movie Review

కరోనా టైంలో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ అంటూ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయ్యారు. కానీ ఆ తరువాత సూర్య నటించిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. ఎన్ని ప్రయోగాలు చేసినా, జానర్స్ మార్చినా ఫలితం మాత్రం ఆశించినంతగా రాలేదు. ఇక ఇప్పుడు ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీకి చివరి నిమిషంలో ఆర్థిక కష్టాలు వచ్చాయి. అందుకే మే 14న రావాల్సిన ఈ సినిమా మే 15న వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ఆడియెన్స్‌కి ఏ మేరకు నచ్చుతుంది? అన్నది చూద్దాం.

కథ

మునుస్వామి (ఇంద్రాన్స్) తన కూతురు మీను ఆపరేషన్ కోసం తమిళనాడు నుంచి హైదరాబాద్‌కు వస్తాడు. వచ్చి రాగానే అతని వద్ద 60 సవర్ల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్తారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తే 45 సవర్లే వచ్చాయని చెబుతారు. వాటిని కోర్టులో తీసుకోవాలని చెబుతారు. దీంతో నాంపల్లి కోర్టులో ఉండే ఫేమస్ లాయర్ బేబీ కృష్ణ (ఆర్జే బాలాజీ)ని కలుస్తారు. అతనేమో డబ్బుల కోసం న్యాయాన్ని అమ్మేస్తుంటాడు. తన వద్దకు వచ్చిన వారిని జడ్జ్ రాజ నాయకన్ సాయంతో వాయిదాల మీద వాయిదాలు అంటూ కోర్టు చుట్టూ తిప్పి తిప్పి డబ్బులు వసూల్ చేస్తుంటాడు. అలాంటి వాడి చేతిలో చిక్కిన మునుస్వామి చివరకు విసిగి పోతాడు. అంతా దేవుడి మీదే భారం అని వీరభద్రుడు సాయం కోరతాడు. దీంతో వీరభద్రుడు (సూర్య) రంగంలోకి దిగుతాడు. అయితే బేబీ కృష్ణ మాత్రం ఇక్కడ ఇలానే ఉంటుంది.. ఇదే చట్టం, న్యాయం, ఇదే ప్రాసెస్ అని అంటాడు. నీకు చేతనైతే వచ్చి ఈ సిస్టమ్‌ను మార్చు అని దేవుడికే సవాల్ విసురుతాడు. సాధారణ మనిషిలా పోరాడాలి.. పవర్స్ వాడకూడదు అని కండీషన్ పెడతాడు. దీంతో లాయర్ సూర్యగా ఆ వీరభద్రుడు వస్తాడు. సాధారణ వ్యక్తిగా, లాయర్‌గా కేసును వాదిస్తుంటాడు. అంతలోనే ఆపరేషన్ లేట్ అవ్వడంతో మునుస్వామి కూతురు చనిపోతుంది. వారికి న్యాయం చేయలేకపోయాను అని వీరభద్రుడు అనుకుంటాడు. దీంతో బేబీ కృష్ణ తను ఎంచుకున్న మార్గమే రైట్ అని వీరభద్రుడితో అంటాడు. ఆ తరువాత వీరభద్రుడు ఏ దారి ఎంచుకుంటాడు? కోర్టులో అబద్దాలు చెప్పి న్యాయాన్ని అమ్మేస్తున్న లాయర్లను ఏం చేస్తాడు? అందరికీ న్యాయం చేసేందుకు వీరభద్రుడు చేసిన మాయ ఏంటి? ఈ కథలో లాయర్ ప్రీతి (త్రిష) పాత్ర ఏంటి? చివరకు బేబీ కృష్ణ కథ ఎలా ముగుస్తుంది? అన్నది తెరపై చూడాల్సిందే.

ప్రస్తుతం ఉన్న సమాజం, సిస్టమ్‌ను చూస్తే.. అందరికీ ఏదో ఒక టైంలో.. ఆ దేవుడు దిగి వచ్చినా ఈ మనుషుల్ని, సమాజాన్ని మార్చలేడు అని అనుకునే ఉంటారు. సరిగ్గా ఆ పాయింట్‌తోనే ఈ కథను అల్లినట్టుగా అనిపిస్తుంది. ఆ దేవుడే సాధారణ వ్యక్తిలా వస్తే ఇక్కడ ఒక్క వ్యక్తిని కూడా మార్చలేం, మంచి దారిలో పెట్టలేం, ఈ సిస్టమ్‌ను మార్చలేం అని చూపించాడు. దేవుడు అనే సూపర్ పవర్ భూమ్మీదకు రావడం అనే కాన్సెప్ట్ కొత్తేమీ కాదు. ఇప్పటికీ కొన్ని వందల చిత్రాలు వచ్చాయి.

ఆర్జే బాలాజీ సైతం ఇదివరకే ఇదే కాన్సెప్ట్‌తో నయనతారతో మూకుత్తి అమ్మన్ సినిమాను తీశాడు. ఇక ఇప్పుడు వీరభద్రుడు కూడా అదే కాన్సెప్ట్. అయితే ఈసారి తన కాన్సెప్ట్‌కి కోర్ట్ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నాడు ఆర్జే బాలాజీ. మామూలుగానే కోర్ట్ డ్రామాలు ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. కోర్టులో జరిగే ప్రొసీజర్ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ సినిమాలోనూ ఫస్ట్ హాఫ్ అంతా కోర్ట్ డ్రామాగానే సాగుతుంది. ఫస్ట్ సీన్‌తోనే సినిమాలోకి లీనమయ్యేలా చేస్తాడు దర్శకుడు. ఆ దొంగలు దొరుకుతారా? నగలు చేతికి వస్తాయా? అమ్మాయికి ఆపరేషన్ జరుగుతుందా? లాయర్ ఆటను వీరభద్రుడు ఎలా కట్టిస్తాడు? అనే ఇంట్రెస్టింగ్ పాయింట్లతో అలా ఇంటర్వెల్ వరకు బాగానే సాగుతుంది.

సెకండాఫ్‌ ఎలా ఉంటుందో అని అనుకునే ప్రేక్షకులకు కాస్త నిరాశే ఎదురవుతుంది. ఇక సూపర్ పవర్, దేవుడు విశ్వరూపం చూపిస్తాడేమో.. ఆట రసవత్తరంగా ఉంటుందేమో అని అంతా అనుకుంటారేమో. కానీ సరిహద్దు, క్షేత్రపాలకుడు అనే కాన్సెప్ట్‌ పెట్టి.. ఒక ప్రాంతం వరకే పవర్స్‌ ఉంటాయని చెప్పడం, కోర్టుని వేరే ప్లేస్‌కి మార్చడం వంటి సీన్లతో సినిమా ఎటో ఎటో పోతోందనే ఫీలింగ్ వస్తుంది. దేవుడే కదా.. అలా ఎందుకు చేయలేడు.. ఇలా ఎందుకు చేయలేడు.. వాడిని ముందే ఎందుకు అంతం చేయడం లేదు.. అనే ప్రశ్నలు ప్రేక్షకులకు వస్తాయి.

ఇక క్లైమాక్స్‌లో సూర్య విధ్వంసం సృష్టించాడని చెప్పుకోవచ్చు. ఇక ఎండింగ్ చూస్తుంటే రెండో పార్ట్‌కి కూడా ప్లాన్ చేసినట్టుగా ఉంది. ఈ సారి కోర్టుల చుట్టూ దేవుడు తిరిగాడు.. నెక్స్ట్ పాలిటిక్స్‌లోకి వచ్చి అసెంబ్లీ చుట్టూ తిరిగేలా ఉన్నాడు. సాంకేతికంగా ఈ మూవీని చూసుకుంటే విజువల్స్ బాగుంటాయి. సాయి అభ్యంకర్ కొట్టిన దెబ్బకి ఒక్క పాట, అందులోని సాహిత్యం కూడా సరిగ్గా వినిపించలేదు. ఫైట్స్ బాగున్నాయి. కోర్టుకి వెళ్తే శిక్ష పడటం కాదు.. కోర్టుకి వెళ్లడమే శిక్ష అనే డైలాగ్ మాత్రం సూటిగా ప్రేక్షకుల హృదయాల్ని తాకుతుంది. ఎడిటింగ్, ఆర్ట్ ఇలా అన్ని డిపార్ట్మెంట్‌ల పనితీరు బాగుంది. నిర్మాణ పరంగా ఈ చిత్రం ఉన్నత స్థాయిలోనే కనిపిస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో సూర్య గెస్ట్ రోల్‌లో కనిపిస్తాడు. సూర్యకి స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉంది. ఉన్నంతలో సూర్య అదరగొట్టేశాడు. కాకపోతే ఈ సారి డబ్బింగ్ మాత్రం తేడా కొట్టింది. త్రిషకి ఫస్ట్ హాఫ్ కంటే సెకండాఫ్‌లోనే కాస్త ఎక్కువ సీన్లు పడ్డట్టు అనిపిస్తుంది. ఈ సినిమాలో ఆర్జే బాలాజీ ఎక్కువ సేపు కనిపిస్తాడు. ఇది సూర్య కోసం కాకుండా తన కోసమే రాసుకుని, తన కోసమే తీసుకున్నట్టుగా ఉంది. మిగిలిన పాత్రల్లో జార్జ్ మరియన్, ఇంద్రాన్స్, నటరాజన్, స్వసిక, మన్సూర్ అలీ ఖాన్ ఇలా అందరూ తమ పరిధి మేరకు నటించారు.

ఓవరాల్‌గా ఆర్జే బాలాజీ కాకుండా ఈ చిత్రంలో సూర్య ఎక్కువ సేపు కనిపించి ఉంటే బాగుండేది. ఆర్జే బాలాజీ కేవలం దర్శకుడిగా ఈ మూవీని తీసి ఉంటే.. సెకండాఫ్ మీద మరింత ఫోకస్ పెట్టి ఉంటే ఫలితం మరింత అద్భుతంగా వచ్చే అవకాశం ఉండేదనిపిస్తుంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Actor Suriya
  • Kollywood
  • Movie Review And Rating
  • RJ Balaji
  • tollywood
  • Trisha Krishnan
  • VeeraBhadrudu

Related News

Do we not have the standing to meet NTR? This is the reason why we have come before the media!

RAW NTR: ఎన్టీఆర్ ను కలిసే అర్హత మాకు లేదా? మేము మీడియా ముందుకు రావడానికి కారణం ఇదే!

టాలీవుడ్‌లో స్టార్ హీరోల అభిమాన సంఘాల మధ్య అంతర్గత వివాదాలు, ఆరోపణలు అప్పుడప్పుడు హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య చోటుచేసుకున్న ఒక సరికొత్త వివాదం నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్టీఆర్ అభిమానులతో కూడిన ‘రా ఎన్టీఆర్’ (RAW NTR) ఆర్గనైజేషన్ ప్రతిష్టాత్మకంగా ‘ఊరు వాడా’ అనే కొత్త పోస్టర్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. అయితే ఈ పోస్టర

  • Fans clarify Junior NTR's political entry.

    Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఫ్యాన్స్

Latest News

  • Hyderabad : జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు.. !!

  • Wife Killed Husband : ఆరు నెలల్లో దేశంలో ఎంతమంది భార్యల చేతిలో భర్తలు చనిపోయారో తెలుసా ?

  • CJP ‘Chalo Parliament’ : రేపు CJP ‘ఛలో పార్లమెంట్’.. ఢిల్లీలో హైఅలర్ట్

  • UP : గోల్డ్ మెడలిస్ట్ ఆత్మహత్య!

  • J&K Cloudburst Tragedy: జమ్మూలో ప్రకృతి బీభత్సం.. 15 మందికిపైగా మృతి

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd