Varun Tej : ఫ్లాపులున్నా బిజినెస్ అదుర్స్.. వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ హయ్యెస్ట్ డీల్..!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) రీసెంట్ మూవీ గాంఢీవదారి అర్జున సినిమా ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం
- By Ramesh Published Date - 10:48 AM, Fri - 29 September 23

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) రీసెంట్ మూవీ గాంఢీవదారి అర్జున సినిమా ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా ఏమాత్రం ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది. ప్రస్తుతం వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ (Operation Valentine) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాను తెలుగు హిందీ భాషల్లో బైలింగ్వల్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. సినిమాలో వరుణ్ తేజ్ కి జోడీగా మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ (Manushi Chillar) నటిస్తుంది.
సినిమాలో వరుణ్ తేజ్ ఐ.ఏ.ఎఫ్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఆపరేషన్ వాలెంటైన్ సినిమా బిజినెస్ లో దూకుడు చూపిస్తుంది. వరుణ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు గని, గాంఢీవదారి అర్జున ఫ్లాపులు కొట్టినా ఆపరేషన్ వాలెంటైన్ కి మాత్రం బిజినెస్ అదిరిపోయింది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే 50 కోట్ల దాకా నిర్మాతలకు డీల్ కుదిరిందట. డిజిటల్, శాటిలైట్, ఆడియో రైట్స్ తోనే ఈ మొత్తం వచ్చినట్టు తెలుస్తుంది.
వరుణ్ తేజ్ కెరీర్ లో హయ్యెస్ట్ బిజినెస్ చేసిన మూవీగా ఆపరేషన్ వాలెంటైన్ రికార్డ్ సృష్టించింది. సినిమా నుచి ఆమధ్య వచ్చిన టీజర్ ఇంప్రెస్ చేయగా సినిమాపై మేకర్స్ చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నారు. వరుణ్ తేజ్ ఈ సినిమా తర్వాత మట్కా అంటూ పాన్ ఇండియా సినిమాతో వస్తున్నారు. వైరా క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.
మెగా హీరోల్లో డిఫరెంట్ సినిమాలు చేస్తూ వస్తున్న వరుణ్ తేజ్ కమర్షియల్ రేసులో మాత్రం వెనకబడి ఉన్నాడు. మెగా ఫ్యాన్స్ మాత్రం వరుణ్ తేజ్ కం బ్యాక్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
Also Read : Sandeep Reddy Vang : సందీప్ వంగ.. నెక్స్ట్ బిగ్ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ సినిమా..!