Sandeep Reddy Vang : సందీప్ వంగ.. నెక్స్ట్ బిగ్ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ సినిమా..!
Sandeep Reddy Vanga కాలం మారుతున్నా కొద్దీ టెక్నాలజీ పరంగా చాలా మార్పులు వస్తున్నాయి. ఇదే సినిమాల విషయానికి వస్తే
- Author : Ramesh
Date : 29-09-2023 - 10:26 IST
Published By : Hashtagu Telugu Desk
Sandeep Reddy Vanga కాలం మారుతున్నా కొద్దీ టెక్నాలజీ పరంగా చాలా మార్పులు వస్తున్నాయి. ఇదే సినిమాల విషయానికి వస్తే పాత కథలు మూస కథలకు మంగళం పాడేసి కొత్త తరహా కథలను సినిమా మేకింగ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి పాత్ బ్రేకింగ్ సినిమాలు తీసే దర్శకులు చాలా మంది ఉన్నా వారిలో నెక్స్ట్ బిగ్ థింగ్ ఎవరు అన్నది ఆలోచిస్తే మాత్రం కొన్ని పేర్లు ప్రస్తావనలోకి వస్తాయి. అలాంటి వారిలో అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ వస్తాడని చెప్పొచ్చు.
సందీప్ వంగ డైరెక్షన్ లో వచ్చిన అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాను ఇలా ఒక క్యారెక్టర్ డ్రైవెన్ గా చెప్పొచ్చా అని సర్ ప్రైజ్ చేశాడు. అర్జున్ రెడ్డి సినిమాతో తన బలమైన దర్శకత్వ ప్రతిభను చూపించిన సందీప్ వంగ ఆ తర్వాత అదే సినిమాను హిందీలో కూడా తీసి హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు యానిమల్ అంటూ మరో సంచలనానికి సిద్ధం అవుతున్నాడు.
బాలీవుడ్ ఫైనెస్ట్ యాక్టర్ రణ్ బీర్ కపూర్ (Rannbir Kapoor) తో సందీప్ వంగ చేస్తున్న యానిమల్ సినిమా టీజర్ తోనే సినిమా సంథింగ్ స్పెషల్ అనిపించేలా చేసింది. తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ రైడ్ తో పాటుగా సినిమాలో మరోసారి తన హీరో క్యారెక్టర్ కాన్ ఫ్లిక్ట్స్ ని జస్ట్ శాంపిల్ చూపించాడు సందీప్ వంగ. నిమిషం నిడివి తో వచ్చిన యానిమల్ టీజర్ తోనే చాలా లేయర్స్ చూపించిన సందీప్ వంగ సినిమా మొత్తం నెక్స్ట్ లెవెల్ లో తీశాడని అంచనా వేయొచ్చు.
కచ్చితంగా పాన్ ఇండియా వైడ్ లో నెక్స్ట్ బిగ్ డైరెక్టర్ గా సందీప్ వంగ (Sandeep Reddy Vanga) పేరు మారుమ్రోగుతుందని చెప్పొచ్చు. యానిమల్ తర్వాత సందీప్ ప్రభాస్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఇలా తన లైనప్ తో సర్ ప్రైజ్ చేస్తున్నాడు. తెలుగు దర్శకులు బాలీవుడ్ లో సత్తా చాటే ప్రయత్నంలో సందీప్ వంగ తన కాంట్రిబ్యూషన్ ఇస్తున్నాడని చెప్పొచ్చు.
Also Read : Michael Gambon : హ్యారీ పోటర్ నటుడు మృతి