Varun Tej : నాలుగు నెలల్లో రెండు సినిమాలు రిలీజ్.. మరో పక్క పెళ్లి కూడా.. ఫుల్ బిజీగా వరుణ్ తేజ్..
రెండు కొత్త కథలతో నాలుగు నెలల గ్యాప్ తో అంచనాలు ఉన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు వరుణ్ తేజ్.
- By News Desk Published Date - 06:42 PM, Mon - 14 August 23

మెగా ఫ్యామిలి(Mega Family)లో కమర్షియాలిటీతో పాటు ప్రయోగాలు కూడా చేసే హీరో వరుణ్ తేజ్(Varun Tej ). కెరీర్ మొదటి నుంచి కూడా కమర్షియాలిటీ వైపు ఎక్కువగా వెళ్లకుండా సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. అయితే వరుణ్ తేజ్ కి ఈ సంవత్సరం చాలా స్పెషల్ గా మారనుంది.
వరుణ్ తేజ్ ఇటీవలే కొన్ని రోజుల క్రితం హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)ని నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. మిస్టర్(Mister) సినిమా సమయంలో ప్రేమలో పడి దాదాపు ఆరేళ్లుగా ప్రేమించుకొని ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇక వీరి పెళ్లి నవంబర్ లో ఇటలీలో చేసుకోనున్నట్టు సమాచారం. ఇలా పెళ్లి(Marriage) పనులతో బిజీగా ఉంటాడు అనుకుంటే నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు రిలీజ్ పెట్టుకున్నాడు వరుణ్.
వరుణ్ తేజ్ గత సినిమా గని(Ghani) ఫ్లాప్ అయింది. ప్రస్తుతం వరుణ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున(Gandeevadhari Arjuna) అనే స్పై యాక్షన్ సినిమా చేస్తున్నాడు వరుణ్. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. మొదటిసారి వరుణ్ స్పై యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ మరిన్ని అంచనాలు పెంచింది. ఇక గాండీవధారి అర్జున సినిమా ఆగస్టు 25న రిలీజ్ కాబోతుంది.
అనంతరం వరుణ్ తేజ్ తన 13వ సినిమాతో రాబోతున్నాడు. నేడే వరుణ్ తేజ్ 13వ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘ఆపరేషన్ వాలెంటైన్’(Operation Valentine) అనే టైటిల్ ని ప్రకటించారు. ఈ సినిమాలో మాజీ ప్రపంచ సుందరి మనుషి చిల్లర్ నటిస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నామని ప్రకటించారు. ఇక ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాని డిసెంబర్ 8న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.
ఇలా రెండు కొత్త కథలతో నాలుగు నెలల గ్యాప్ తో అంచనాలు ఉన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు వరుణ్ తేజ్. ఇక ఇదే గ్యాప్ లో పెళ్లి కూడా చేసుకొని లైఫ్ ని మరింత హ్యాపీగా మార్చుకోబోతున్నాడు. దీంతో ఈ నాలుగు నెలలు వరుణ్ చాలా బిజీగా ఉండి ఈ ఇయర్ ని మరింత స్పెషల్ గా మార్చుకోబోతున్నాడని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : D51: క్రేజీ కాంబినేషన్.. ధనుష్-శేఖర్ కమ్ముల మూవీలో నేషనల్ క్రష్ రష్మిక!