Vaccine War: ది వ్యాక్సిన్ వార్ పై సీఎం యోగి కామెంట్స్
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన 'ది వ్యాక్సిన్ వార్' చిత్రాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రశంసించారు. ది కాశ్మీర్ ఫైల్స్ తర్వాత వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన చిత్రం
- By Praveen Aluthuru Published Date - 05:19 PM, Tue - 10 October 23

Vaccine War: వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ‘ది వ్యాక్సిన్ వార్’ చిత్రాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రశంసించారు. ది కాశ్మీర్ ఫైల్స్ తర్వాత వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన చిత్రం ది వ్యాక్సిన్ వార్. ఈ గత నెల 28న విడుదలైన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, నానా పటేకర్, సప్తమి గౌడ, పల్లవి జోషి ప్రధాన పాత్రలు పోషించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
ఉన్నావ్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో స్వాతంత్ర్య సమరయోధుడు రాజారావు రామపక్ష్ సింగ్ విగ్రహాన్ని యోగి ఆదిత్యనాథ్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. తన ప్రసంగంలో ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమాను ప్రస్తావించారు. ది వ్యాక్సిన్ వార్ చిత్రం విడుదలైంది. ఈ చిత్రం అంతర్జాతీయ రంగంలో భారతదేశం శాస్త్రీయ విజయాలను బయటపెట్టింది. ఈ చిత్రం భారతదేశానికి వ్యతిరేకంగా జరిగిన కుట్రలను బహిర్గతం చేస్తుంది మరియు భారతీయ శాస్త్రవేత్తలు చేసిన సంచలనాత్మక పరిశోధనలను హైలైట్ చేస్తుంది. కరోనా పోరాటం అనేది వ్యక్తి పోరాటం కాదు. ప్రధాని సారథిలా నడిపించగా.. కొందరు అసత్యాలు ప్రచారం చేస్తూ పోరాటాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించారని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
Also Read: BRS Minister: మానవత్వం చాటుకున్న మంత్రి మహేందర్ రెడ్డి!