Heroine: ఈ హీరోయిన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. నిమిషానికి కోటి.. ఆస్తి ఏకంగా రూ.550 కోట్లు.. ఎవరో తెలుసా?
ఇప్పుడు చెప్పబోయే ఈ హీరోయిన్ నిమిషానికి ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటూ ప్రతి ఒక్కరినే ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
- By Anshu Published Date - 02:03 PM, Fri - 21 February 25

ఏంటి నిమిషానికి కోటి రూపాయలా అని ఆశ్చర్య పోతున్నారా! మీరు విన్నది నిజమే. ఇప్పుడు మనం తెలుసుకోబోయే హీరోయిన్ క్రేజ్ నిజంగా మామూలుగా లేదు. నిమిషానికి కోటి రూపాయలు రెమినరేషన్ అందుకుంటూ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాకుండా ఈమె ఇటీవల ఒక తెలుగు సినిమాతో సంచలనం కూడా సృష్టించింది. ఇప్పటికే హీరోయిన్ ఎవరు మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆమె మరెవరో కాదండోయ్ ఊర్వశి రౌతేలా. ఇటీవల బాలయ్య బాబు హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమాతో భారీగా పాపులారిటీని సంపాదించుకున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాతో మరో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. వరుస ఇంటర్వ్యూ లతో ఇప్పటికే వార్తల్లో నిలుస్తున్న ఈ బ్యూటీ తాజాగా సినిమాలో మూడు నిమిషాల పాత్ర కోసం ఏకంగా మూడు కోట్ల రూపాయలు వసూలు చేసింది అన్న ఒక వార్త వైరల్ గా మారడంతో ఈ ముద్దుగుమ్మ పేరు మరింత వైరల్ గా మారింది. అంటే నిమిషానికి కోటి రూపాయలు చొప్పున ఈమె రెమ్యూనరేషన్ అందుకుంటోంది అని తెలియడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆమె ఆస్తి విలువ ఏకంగా 550 కోట్లు ఉంటుందని టాక్.
ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో షాక్ అవుతున్నారు అభిమానులు. దానికి తోడు ఈమెకు ఇన్స్టాగ్రామ్ లో 73 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉండడంతో ఇంస్టాగ్రామ్ ద్వారా పలు యాడ్స్ చేస్తూ ఇంస్టాగ్రామ్ ద్వారా కూడా భారీగా సంపాదిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అలాగే ఈమెకు వారసత్వంగా వచ్చిన ఆస్తులు కూడా ఉన్నాయట. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో షాక్ అవుతున్నారు అభిమానులు. ఇకపోతే డాకు మహారాజ్ సినిమాతో ఈమె పేరు బాగా వైరల్ అవ్వడంతో పాటు భారీగా క్రేజ్ రావడంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వరుసగా వస్తున్నట్లు తెలుస్తోంది.