Naming Ceremony: నేడు చరణ్, ఉపాసనల కుమార్తె నామకరణ వేడుక
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల గారాలపట్టికి ఈ రోజు హైదరాబాద్‌లో నామకరణ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. జూన్ 20న ఈ దంపతులు పండంటి
- Author : Praveen Aluthuru
Date : 30-06-2023 - 11:43 IST
Published By : Hashtagu Telugu Desk
Naming Ceremony: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల గారాలపట్టికి ఈ రోజు హైదరాబాద్‌లో నామకరణ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. జూన్ 20న ఈ దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కుమార్తె నామకరణ వేడుకకు సంబంధించి ఉపాసన ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. హైదరాబాద్ లోని వారి నివాసంలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. కాగా ఇదే రోజు పురస్కరించుకుని ఊయల వేడుకను జరపాలని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే చరణ్, ఉపాసన దంపతులు పాపకు పేరును ఎంచుకున్నారట. త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు మెగా ప్రిన్సెస్ పేరు కోసం మెగా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
2012 జూన్ 4న రామ్ చరణ్, ఉపాసనలకు వివాహం జరిగింది. దాదాపు పదేళ్ల తరువాత ఈ దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్నంటాయి.
Read More: PM Modi: ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్..!