“Tuk Tuk” : అమెజాన్ లో అదరగొడుతున్న టుక్ టుక్
"Tuk Tuk" : ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా, ట్రెండింగ్‌లో నంబర్ 3 స్థానాన్ని సంపాదించి, ఆశ్చర్యం కలిగించింది
- By Sudheer Published Date - 08:21 PM, Sat - 31 May 25

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రాలు కొన్ని మాత్రమే ఉంటాయి. అలాంటి చిత్రాల్లో టుక్ టుక్ (Tuk Tuk) చేరింది. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా, ట్రెండింగ్‌లో నంబర్ 3 స్థానాన్ని సంపాదించి, ఆశ్చర్యం కలిగించింది. అంతే కాదు ఇప్పటి వరకు ఈ చిత్రానికి 100 మిలియన్‌కు పైగా వ్యూస్ రాబట్టడం విశేషం. చిన్న సినిమాగా స్ట్రీమింగ్ లో వచ్చి పెద్ద విజయం సాధించి వార్తల్లో నిలుస్తుంది.
Gill Breaks Silence: మా ఇద్దరి మధ్య ప్రేమ మాత్రమే ఉంది.. పాండ్యా తీరుపై స్పందించిన గిల్!
వీక్షకులు ఈ సినిమాను అంతగా ఆదరించడమే కాకుండా, ప్రతి క్యారెక్టరును, ప్రతి నటుడి నటనను ప్రశంసిస్తున్నారు. కథకు న్యాయం చేసిన డైరెక్షన్, నాటకీయతతో పాటు హ్యూమర్‌ను సమపాళ్లలో మేళవించిన స్క్రీన్‌ప్లే, అద్భుతమైన సంగీతం..ఇలా ప్రతీ అంశం సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఈ సినిమా లో నటించిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా యువతర నటీనటులు తమ పాత్రల ద్వారా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. కొంతమంది నటులు తమ డైలాగ్ డెలివరీతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు కూడా!
CM Nitish Kumar: దేశ ప్రధాని పేరు మర్చిపోయిన సీఎం నితీష్ కుమార్…
Tuk Tuk సినిమాలో పెద్ద స్టార్ క్యాస్ట్ లేదు. భారీ బడ్జెట్ లేదు. కానీ స్నేహితుల కృషి, కొత్తతనం, మనసుకు హత్తుకునే కథ, ప్రేక్షకుల హృదయాలను తాకింది. మంచి కంటెంట్ చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందనే విషయాన్ని మరోసారి ఈ సినిమా తీసుకొచ్చింది. ఈ సినిమా విజయంతో, చిన్న సినిమాల దర్శకులకు, నటులకు మరింత గౌరవం, ప్రోత్సాహం లభిస్తుందని ఆశిద్దాం.