HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Trolls At That Time Now Whistles

Trolls: నాడు ట్రోల్.. నేడు జేజేలు

సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవడం అంటే ఆషామాషీ కాదు. అందం ఉంటే సరిపోదు అందంతో పాటు అభినయం, టాలెంట్ ముఖ్యం. వారసత్వంతో సినిమాలోకి వచ్చినా..

  • Author : Hashtag U Date : 08-04-2023 - 6:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Trolls At That Time... Now Whistles...
Trolls At That Time... Now Whistles...

Trolls : సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవడం అంటే ఆషామాషీ కాదు. అందం ఉంటే సరిపోదు అందంతో పాటు అభినయం, టాలెంట్ ముఖ్యం. వారసత్వంతో సినిమాలోకి వచ్చినా.. టాలెంట్ లేకపోతే వెనుదిరగాల్సిందే. అలా మెగా కుటుంబం నుంచి వచ్చిన అల్లు వారి అబ్బాయి అల్లు అర్జున్ ఒక్కో సినిమాతో తానేంటో ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. తన మొదటి సినిమా గంగోత్రితో సినిమా ప్రయాణం మొదలుపెట్టి పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగాడు. ఇదంతా ఒక్క రాత్రితో వచ్చిన విజయం కాదు. సినిమా సినిమాకు నటనలో ఓనమాలు నేర్చుకుంటూ.. బాడీ లాంగ్వేజ్ ని మార్చుకుంటూ తనకంటూ ఫ్యాన్ బేస్ క్రేయేట్ చేసుకున్నాడు. ఒక్కో సినిమాలో ఒక్కో లుక్ లో కనిపించి ఐకాన్ స్టార్ గా మారాడు. అయితే అల్లు అర్జున్ కూడా తన సినీ కెరీర్లో ట్రోల్ (Trolls) ని ఎదుర్కోకతప్పలేదు.

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక ప్రధాన పాత్రలో నటించిన సినిమా పుష్ప ది రైజ్. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించిన పుష్ప ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫిస్ వద్ద అఖండ విజయాన్ని అందుకుంది. ఊహించని వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ పై దండయాత్ర చేసింది. దాంతో బన్నీ రేంజ్ ఒక్కసారిగా ఎల్లలు దాటింది. విదేశీయులు సైతం బన్నీ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

ఇక క్రికెటర్లు అల్లు అర్జున్ పాటలకు రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో అల్లు అర్జున్ అనే హీరో పేరు హాలీవుడ్ స్థాయికి చేరింది. ముఖ్యంగా అల్లు అర్జున్ నటనకు వందకు వంద మార్కులు పడ్డాయి. తాజాగా అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప ది రూల్ సినిమా నుండి పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఆ పోస్టర్లో బన్నీ చీరకట్టులో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. మాస్ లుక్ లో చీరకట్టుకుని, గన్ చేతపట్టుకుని ఉన్న ఆ పోస్టర్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఆ పోస్టర్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

అల్లు అర్జున్ తన మొదటి చిత్రం గంగోత్రిలో ఓ సన్నివేశంలో లంగాలో కనిపించాడు. అయితే అప్పట్లో అల్లు అర్జున్ పై విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. యాంటీ ఫ్యాన్స్ ఈ మెగా హీరోని ఓ ఆట ఆడుకున్నారు. అయితే అప్పట్లో ట్రోల్ చేసిన వాళ్ళే నేడు అల్లు అర్జున్ చీరకట్టులో కనిపించగా.. జేజేలు కొడుతున్నారు. పుష్ప ది రూల్ పోస్టర్ పై యాంటీ ఫ్యాన్స్ సైతం పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. టాలెంట్ ఎవ్వడి అబ్బ సొత్తు కాదు అంటూ పోస్టులు పెడుతున్నారు. పోస్టర్ విషయానికి వస్తే పోస్టర్ లో అల్లు అర్జున్ కష్టం కనిపిస్తుంది. డీ గ్లామర్ రోల్ లో బన్నీ చాలానే కష్టపడ్డాడు. సుకుమార్ ఆలోచనకు తగ్గట్టు బన్నీ తన బాడీ లాంగ్వేజ్ ని మార్చుకుని సినిమా కోసం ప్రాణం పెట్టినట్టు అర్ధం అవుతుంది.

Also Read:  Mangos in EMI: ఈఎంఐ లో మామిడి పండ్లు కొనొచ్చు.. వ్యాపారి కొత్త ఆలోచన


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Industry
  • Now
  • Then
  • tollywood
  • trolls
  • Whistles

Related News

Surgery For Appearance Avika Gor

Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక అవికా గోర్ ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తమపై వస్తున్న సర్జరీ వదంతులను అవికా పూర్తిగా తోసిపుచ్చింది. “నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వ

  • A Strong Counter to Trolls: Kangana Ranaut Stands by Aishwarya

    Cannes 2026: ట్రోల్స్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్.. ఐశ్వర్యకు అండగా నిలిచిన కంగనా రనౌత్

Latest News

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd