Trisha praises Animal: త్రిష యానిమల్ మూవీ రివ్యూ: వివాదంతో పోస్ట్ తొలగింపు
అర్జున్‌రెడ్డి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యానిమల్. ప్రముఖ హిందీ నటుడు రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెన్సార్ 'A' సర్టిఫికేట్ ఇచ్చింది.
- Author : Praveen Aluthuru
Date : 04-12-2023 - 12:36 IST
Published By : Hashtagu Telugu Desk
Trisha praises Animal: అర్జున్‌రెడ్డి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యానిమల్. ప్రముఖ హిందీ నటుడు రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెన్సార్ ‘A’ సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా మొత్తం రన్ టైం 3 గంటల 21 నిమిషాలు.తండ్రీకొడుకుల మధ్య అనుబంధం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. ఈ చిత్రానికి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంలో నటి త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ లో కల్ట్ ఫిల్మ్ అంటూ చప్పట్లు కొట్టే ఎమోజీలతో పాటు ప్పాఆఆఆ అని పోస్ట్ పెట్టింది. దీంతో ఒక్కసారిగా విమర్శలు రావడంతో పోస్టును తొలగించింది. కాగా… కొద్దిరోజుల క్రితం మన్సూర్ అలీఖాన్ వివాదంలో చిక్కుకున్నప్పుడు.. తనకు మహిళలంటే గౌరవం లేదని.. ఇప్పుడు మహిళలపై తీసిన సినిమాని కొనియాడినట్లు సోషల్ మీడియాలో కొందరు విమర్శలు చేస్తున్నారు.
Also Read: What happened in Chhattisgarh? : చత్తీస్ గఢ్ లో ఏం జరిగింది?