Floods in AP & TG : అగ్ర హీరోయిన్లు..అనన్యను చూసి బాధ్యత తెచ్చుకోండి
ఇంత డబ్బు తెలుగు ప్రజలు వారిని ఆదరిస్తేనే కదా..వారు సినిమాలు చూడపోతే..వారిని అబిమానించకపోతే వారికీ ఛాన్సులు ఎక్కడివి..వారికీ ఈ లగ్జరీ లైఫ్ ఎక్కడిది
- Author : Sudheer
Date : 04-09-2024 - 8:37 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ ఇండస్ట్రీ (Tollywood Industry) లో కోట్ల రెమ్యూనరేషన్ (Remuneration) తీసుకునే భామలు (Heroins) చాలామందే ఉన్నారు..నాల్గు పాటల్లో హీరోలకు పక్కన చిందులు వేయడం..అందాలను ఆరబోయడం..అంతే వీరి పని..దానికి కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటారు..మరి ఇంత డబ్బు తెలుగు ప్రజలు వారిని ఆదరిస్తేనే కదా..వారు సినిమాలు చూడపోతే..వారిని అబిమానించకపోతే వారికీ ఛాన్సులు ఎక్కడివి..వారికీ ఈ లగ్జరీ లైఫ్ ఎక్కడిది..అలాంటి లైఫ్ ఇచ్చిన తెలుగు ప్రజలు ఆపదలో ఉన్నారంటే కనీసం మానవత్వం..సమాజం ఫై బాధ్యత లేకుండా పోయింది వారికీ. భారీ వర్షాల (Floods in AP & TG) కారణంగా తెలుగు ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. వరదలు వేలాది పంటపొలాలను , వందలాది ఇల్లాలు ముంచేసాయి. కనీసం ఉండేందుకు నీడ లేక తినేందుకు తిండి లేక, తాగేందుకు నీరు లేక, జేబులో చిల్లి గవ్వ లేక నరకయాతన అనుభవిస్తున్నారు. ఎవరైనా దాతలు సాయం చెయ్యండని వేడుకుంటున్నారు. ఇలాంటి ఈ పరిస్థితి చిత్రసీమ హీరోలు ముందుకు వచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
తమవంతు సాయం ప్రకటిస్తూ మీకు మేమున్నాం అంటున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ , రామ్ చరణ్ , నాగార్జున, మహేష్ బాబు , బాలకృష్ణ ఇలా చిన్న పెద్ద హీరోలే కాదు నిర్మాతలు డైరెక్టర్లు అనేక మంది తమ వంతు సాయం చేస్తున్నారు. తెలుగు అమ్మాయిలైన హీరోయిన్ అనన్యా నాగళ్ళ, యాంకర్ స్రవంతి లు సైతం తమ వంతు సాయం రెండు తెలుగు రాష్ట్రాలకు అందజేశారు. వేలల్లో రెమ్యూనరేషన్ తీసుకునే అనన్యా నాగళ్ళ (Ananya Nagalla), యాంకర్ స్రవంతి (Anchor Sravanthi) తమవంతు సాయం ప్రకటిస్తే కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే సమంత, రష్మిక మందన్నా, తమన్నా భాటియా, పూజా హెగ్డే, కీర్తీ సురేష్, శృతి హాసన్, రకుల్ ప్రీత్ సింగ్, రాశీ ఖన్నా నుంచి మొదలు పెడితే ఇటీవల శ్రీ లీల, మృణాల్ ఠాకూర్, కృతి శెట్టి వంటి హీరోయిన్లు ఏమైపోయారు..? వారికీ కనిపించడం లేదా తెలుగు ప్రజల బాధలు. పెద్దగా ఫేమ్ లేని వేల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకునే చిన్న నటీమణులు సాయం చేస్తే..మీరెందుకు చేయరు.? ఇలాంటి వారినా తెలుగు ప్రజలు ఆదరించేది..వీరికా మన నిర్మాతలు పిలిచి అవకాశాలు ఇచ్చేదే..? అని ప్రజలంతా ఛీ కొడుతూ అనన్యా నాగళ్ళ, యాంకర్ స్రవంతి లను చూసి సిగ్గు తెచ్చుకోండి అని కామెంట్స్ చేస్తున్నారు.
Read Also : GOAT : ‘ది గోట్’ మూవీకి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..