GOAT : ‘ది గోట్’ మూవీకి తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
పెద్ద సినిమాల రిలీజ్ టైములో అదనపు షోస్ కు పర్మిషన్ , టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పిస్తూ నిర్మాతలకు , డిస్ట్రబ్యూటర్స్ కు సంతోషం కలిగిస్తున్నారు
- Author : Sudheer
Date : 04-09-2024 - 8:03 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ కు తెలంగాణ సర్కార్ వరుసగా తీపి కబుర్లు అందజేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పెద్ద సినిమాల రిలీజ్ టైములో అదనపు షోస్ కు పర్మిషన్ , టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పిస్తూ నిర్మాతలకు , డిస్ట్రబ్యూటర్స్ కు సంతోషం కలిగిస్తున్నారు. కేవలం తెలుగు స్ట్రైట్ సినిమాలకే కాదు డబ్బింగ్ చిత్రాలకు కూడా ఆ అవకాశం కలిపిస్తున్నారు. తాజాగా విజయ్ నటించిన ‘ది గోట్'(The Greatest Of All Time) కూడా గుడ్ న్యూస్ అందించింది రేవంత్ సర్కార్.
We’re now on WhatsApp. Click to Join.
విజయ్ (Hero Vijay) నటించిన సైన్స్, ఫిక్షన్, యాక్షన్ డ్రామా ‘ది గ్రెటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (The GOAt). వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో కల్పతి ఎస్ అఘోరం, కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ నిర్మించిన ఈ మూవీ లో ప్రభుదేవా, ప్రశాంత్, అజ్మల్ అమీర్, లైలా, స్నేహ, మీనాక్షి చౌదరీ, వైభవ్, యోగిబాబు నటించారు. రేపు ( సెప్టెంబర్ 5వ తేదీన ) వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో ఈ మూవీ గ్రాండ్ గా విడుదల అవుతుంది. తెలుగు లో ఈ చిత్ర తెలుగు రైట్స్ ను మైత్రి మూవీ మేకర్స్ వారు దక్కించుకోగా రేపు భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు.
ఈ క్రమంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ అదనపు షో వేయడానికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా.. విడుదలైన రోజు ఉదయం 4 గంటల షో కు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే హైదరాబాద్(Hyderabad) లోని కేవలం 15 థియేటర్లకు మాత్రమే ఈ అదనపు షో అనుమతి ఇస్తూ ప్రత్యేక జీవో జారీ చేసింది. ప్రభుత్వం అందించిన ఈ పర్మిషన్ తో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Narendra Modi : సింగపూర్‌లోని ఐకానిక్ శ్రీ టెమాసెక్‌లో కౌంటర్ లారెన్స్ వాంగ్‌తో ప్రధాని మోదీ సమావేశం