Aarti Chabria: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. నెల కిందటే అమ్మా అయ్యానంటూ!
- By Sailaja Reddy Published Date - 09:44 PM, Sun - 7 April 24
బాలీవుడ్ ప్రముఖ నటి, హీరోయిన్ ఆర్తి చాబ్రియా గురించి మనందరికి తెలిసిందే. ఈమె తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే ఇటీవల ఆమె బేబీ బంప్ తో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆర్తి త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా తన ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పింది ఆర్తి. ఇప్పటికే తాను బిడ్డకు జన్మనిచ్చి నెల రోజులు పూర్తయింది అని తెలుపుతూ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.
We’re now on WhatsApp. Click to Join
మార్చి 4వ తేదీన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడించిన ఆర్తి తనకు యువన్ అని పేరు కూడా పెట్టినట్లు చెప్పుకొచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది ఆర్తి చాబ్రియా. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆర్తి దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఆర్తి చాబ్రియా వయసు సుమారు 41 ఏళ్లు. 2019లో ఆమె విశారద్ బీదాస్సీతో కలిసి పెళ్లిపీటలెక్కింది. ఇప్పుడీ బంధానికి ప్రతీకగానే యువన్ ను తమ జీవితంలోకి ఆహ్వానించారు ఆర్తి దంపతులు. అయితే యువన్ పుట్టక ముందే ఆర్తికి గర్భస్రావం అయ్యిందట.
అందుకే తన ప్రెగ్నెన్సీ గురించి ముందుగా మాట్లాడకూడదని నిర్ణయించుకున్నట్లు ఈ ముద్దుగుమ్మ తెలిపింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొందరు సెలబ్రిటీలు ఈ మధ్యకాలంలో పెళ్లి విడాకులుప్రెగ్నెంట్ విషయాలను దాచడం కామెంట్ అయిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆ పోస్ట్ లో ఆర్తి ఈ విధంగా రాసుకొచ్చింది. ఈ ఫోటో మిమ్మల్ని మోసం చేయదు. ఎందుకంటే ఈ ప్రయాణం అంత సులభం కాదు. అమ్మ కావాలనుకుంటున్న మహిళలకు.. ఆ కోరిక తీరనప్పుడు పడే బాధ, కష్టాలు నాకు తెలుసు. ఎందుకంటే నేను చాలా కష్టాలు అనుభవించాను. నేను ఎప్పుడు నవ్వుతూ, అందంగా కనిపించగలను. కాబట్టి ఇది చాలా సులభమైన, తేలికైన విషయమని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ చివరికి ఆ భగవంతుడు నా పట్ల దయతో ఉన్నాడు. మనం కోరుకున్న దానికోసం ఒత్తిడికి దూరంగా ఉంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మనకు అంతా మంచే జరుగుతుంది అని రాసుకొచ్చింది ఆర్తి.
Also Read: Jr Ntr: ఆ యాక్సిడెంట్ తర్వాత నేను బతికింది దానికోసమే: ఎన్టీఆర్
Related News
Meera Jasmine: మొదటిసారి ఫ్యామిలీ ఫోటో ని షేర్ చేసిన మీరా జాస్మిన్.. పోస్ట్ వైరల్!
మీరా జాస్మిన్.. ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకువచ్చే సినిమా గుడుంబా శంకర్, భద్ర ఈ సినిమాలతో పాటు ఈమె తెలుగులో చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఈ రెండు సినిమాలు ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకుంది మీరాజాస్మిన్. అలాగే గోరింటాకు, పందెం కోడి లాంటి ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది మీరాజాస్మిన్. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరంగా ఉంటు�