Tollywood : కూటమి ప్రభుత్వం ఫై టాలీవుడ్ ఆశలు..
గత వైసీపీ ప్రభుత్వం టాలీవుడ్ ను ఎంతగా ఇబ్బందులకు గురి చేసిందో చెప్పాల్సిన పనిలేదు. రూ.10 లకు టీ కూడా రాని ఈరోజుల్లో సినిమా టికెట్ ను రూ. 10 లు చేసి జగన్ తన సైకో ఇజాన్ని చూపించాడు
- By Sudheer Published Date - 12:42 PM, Thu - 6 June 24

చంద్రబాబు అంటే చిత్రసీమకు ఎంతో గౌరవం..అలాగే చంద్రబాబు కు సైతం ఎప్పుడు చిత్రసీమ అంటే ఇష్టం..అభిమానం. చిత్రసీమ కోసం ఎన్నో చేసారు. నిత్యం సినీ ప్రముఖుల విషయంలో పాజిటివ్ గా ఉంటారు. రాజమౌళి , బోయపాటి వంటి అగ్ర డైరెక్టర్స్ తో బాబు పనిచేయించుకోవడం జరిగింది. అంతే కాదు అగ్ర హీరోల తో నిత్యం బాబు టచ్ లో ఉంటాడు. అలాంటి బాబు ఇప్పుడు మరోసారి సీఎం అవుతుండడం తో టాలీవుడ్ అంత సంతోషం వ్యక్తం చేస్తుంది. అంతే కాదు అగ్ర హీరో..అందరు అభిమానించే పవన్ కళ్యాణ్ మొదటిసారిగా ఎమ్మెల్యే గా గెలవడం..తన పార్టీ నుండి 21 మందిని బరిలోకి దింపు అందర్నీ విజేతలుగా చేసి అసెంబ్లీలో అడుగుపెడుతుండడంతో మరింత సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ అంత కూటమి ప్రభుత్వం ఫై ఎన్నో ఆశలు పెట్టుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం టాలీవుడ్ ను ఎంతగా ఇబ్బందులకు గురి చేసిందో చెప్పాల్సిన పనిలేదు. రూ.10 లకు టీ కూడా రాని ఈరోజుల్లో సినిమా టికెట్ ను రూ. 10 లు చేసి జగన్ తన సైకో ఇజాన్ని చూపించాడు. అంతే కాదు ఎన్నడూ లేని విధంగా థియేటర్స్ కు ఆంక్షలు విధించడం, బినెఫిట్ షో కు అనుమతి ఇవ్వకపోవడం..సినీ ప్రముఖులు అంటే చిన్న చూపు చూడడం ఇలా ఎన్నో చేసాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటే అనేక చట్టాలను తీసుకొచ్చి నానా హడావిడి చేసాడు. ఇలా ఇవ్వన్నీ చూస్తూ వచ్చిన టాలీవుడ్..ఇప్పుడు వైసీపీ చిత్తూ కావడంతో వారి సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు తాజాగా జరిగిన శర్వానంద్ మనమే ప్రీరిలిజ్ వేడుకలో పవన్ నామస్మరణతో మొగిపోయింది. చంద్రబాబు, పవన్ విజయం రాష్ట్రానికి పండగ తెచ్చిందని శర్వానంద్ తో పాటు యూనిట్ సభ్యులంతా ముక్తకంఠంతో తెలిపారు. పిఠాపురంలో `మనమే` సక్సెస్ మీట్ వుంటుందని ప్రకటించారు. ఇకపై అన్ని మంచి రోజులే అనే ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఈవెంట్ లో వక్తల మాటలు గమనిస్తే వైసీపీ పాలనలో చిత్ర పరిశ్రమ ఎంతటి డిప్రెషన్ కి లోనైయిందో అర్ధం చేసుకోవచ్చు. రాక్షసుని చెర నుంచి విముక్తి పొందిన ఫీలింగ్ వారిలో స్పష్టంగా కనిపించింది. మరి పవన్ & బాబు టాలీవుడ్ కోసం ఎంత చేస్తారో చూడాలి.
Read Also : BJP : తెలంగాణ బీజేపీ ఎంపీలు ఢిల్లీకి పయనం