Venkatesh : వెంకటేష్ కోసం వాళ్లంతా వస్తున్నారా..?
విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా హిట్ సీరీస్ ల డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్షన్ లో వస్తున్న సినిమా సైంధవ్. వెంకటేష్ 75వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్
- Author : Ramesh
Date : 26-12-2023 - 2:08 IST
Published By : Hashtagu Telugu Desk
విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా హిట్ సీరీస్ ల డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్షన్ లో వస్తున్న సినిమా సైంధవ్. వెంకటేష్ 75వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమా సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 27న జరుగనుంది. ఈ వేడుకకు టాలీవుడ్ అంతా కదిలి వస్తుందని తెలుస్తుంది.
వెంకటేష్ 75వ సినిమాగా వస్తున్న సైంధవ్ సినిమా ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున ఈ ముగ్గురు కూడా అటెండ్ అవుతారని తెలుస్తుంది. వీరితో పాటుగా సూపర్ స్టార్ మహేష్ కూడా ఈ ఈవెంట్ లో పాల్గొంటారని తెలుస్తుంది. సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైన వెంకటేష్ టాలీవుడ్ నాలుగు స్థంభాల్లో ఒకరిగా చెప్పుకుంటారు.
Also Read : KA Paul Offer to Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు భారీ ఆఫర్ ఇచ్చిన KA పాల్..
అందుకే ఆయన ల్యాండ్ మార్క్ మూవీ 75వ సినిమా ఈవెంట్ లో మిగిలిన ముగ్గురు చిరు, బాలయ్య, నాగ్ లు కూడా వచ్చి వెంకటేష్ తో తమకున్న బంధం గురించి మాట్లాడతారని తెలుస్తుంది. ఈవెంట్ ని లైవ్ లో కాకుండా న్యూ ఇయర్ కి రిలీజ్ చేసేలా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. అంతేకాదు ఇదే ఈవెంట్ లో వెంకటేష్ తో కలిసి పనిచేసిన దర్శకులందరికీ కూడా ఆహ్వానం పంపించారని తెలుస్తుంది.
We’re now on WhatsApp : Click to Join