HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Tollywood Star Actor Krishnam Raju Died

Rebel Star : టాలీవుడ్‌లో విషాదం.. అనారోగ్యంతో క‌న్నుమూసిన రెబ‌ల్ స్టార్‌

'82 ఏళ్ల కృష్ణంరాజు మధుమేహం, పోస్ట్ కోవిడ్, తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్‌ రావడంతో చనిపోయారు

  • Author : Prasad Date : 11-09-2022 - 6:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Krishnam Raju Imresizer
Krishnam Raju Imresizer

సినీ న‌టుడు, మాజీ కేంద్రమంత్రి కృష్ణం రాజు (83) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైద‌రాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ ఉదయం 3.25కు తుదిశ్వాస విడిచారు. ఈయన 1940 జనవరి 20 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచే తెలుగు సినీమాలో త‌న స‌త్తా చాటిన కృష్ణంరాజు.. 1999లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాకినాడ లోక్‌స‌భ నుంచి ఎంపీగా గెలిచారు. వాజ్‌పేయి కేబినెట్‌లో కేంద్ర‌మంత్రిగా కృష్ణంరాజు ప‌ని చేశారు. 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు జ‌న్మించారు. ఆయ‌న పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. కృష్ణంరాజుకు భార్య శ్యామలా దేవి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 1966లో చిలకా గోరింక చిత్రంతో తెలుగు సినిమా ప్రవేశం చేసిన రెబ‌ల్ స్టార్‌.. 187కు పైగా చిత్రాల్లో నటించారు. కృష్ణంరాజు తమ్ముడు సూర్యనారాయణ కుమారుడు ప్రభాస్. రాధేశ్యామ్ చిత్రంలో చివ‌రిసారిగా కృష్ణంరాజు న‌టించారు.

కృష్ణంరాజు మృతికి కారణాలు ఇవే!

పోస్ట్ కోవిడ్ ప్రభావం రెబెల్ స్టార్ కృష్ణంరాజు ప్రాణాలను తీసింది. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు మృతికి గల కారణాలను డాక్టర్లు వెల్లడించారు. వాళ్లు చెప్పిన కారణాలు ఇవే.

’82 ఏళ్ల కృష్ణంరాజు మధుమేహం, పోస్ట్ కోవిడ్, తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్‌ రావడంతో చనిపోయారు. గుండె కొట్టుకునే వేగంతో చాలా కాలంగా సమస్య ఉంది. రక్తప్రసరణ సరిగా లేకపోవడంతో గతేడాది ఆయన కాలికి శస్త్రచికిత్స జరిగింది. దీర్ఘకాలంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యతోనూ కృష్ణంరాజు బాధపడుతున్నారు.పోస్ట్ కోవిడ్ సమస్యతో గత నెల 5వ తేదీన ఆస్పత్రిలో చేరారు. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా కారణంగా ఊపిరితిత్తుల్లో తీవ్ర న్యుమోనియా ఉన్నట్టు గుర్తించాం. కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతినడంతో ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించాం. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి గమనిస్తూ తగిన చికిత్స అందించాం. ఆదివారం తెల్లవారుజామున 3.16గంటలకు తీవ్రమైన గుండెపోటు రావడంతో కృష్ణంరాజు కన్నుమూశారు’’ అని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత కృష్ణంరాజు పార్థివదేహాన్ని ఇంటికి తీసుకురానున్నారు. అనంతరం ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం అందుబాటులో ఉంచనున్నారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • krishnam raju
  • krishnam raju dead
  • rebel star
  • tollywood

Related News

International Thalassemia Day

Nara Bhuvaneswari: ‘తలసేమియా రన్’ వ్యాధిపై అవగాహన కల్పించి చిన్నారులు అండగా నిలవాలని నారా భువనేశ్వరి

తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆదివారం హైదరాబాద్‌లో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలోని నెక్లెస్ రోడ్డులో ‘తలసేమియా రన్’ను ఘనంగా నిర్వహించింది. జలవిహార్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. ఈ పరుగులో 3K, 5K, 10K విభా

  • Retired IPS Officer Wife Incident in Jubilee Hills

    Hyderabad: జూబ్లీహిల్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య

  • Legendary producer R. B. Choudary has passed away

    Rb Choudary: టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ సూపర్‌గుడ్‌ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం

  • Fauji Movie

    Fauzi: ప్రభాస్ ఫౌజీ షూటింగ్‌లో.. ఒకరు మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలు

Latest News

  • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

  • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

  • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd