Ram Charan: శంకర్ ఎఫెక్ట్.. యాడ్స్ షూట్స్ తో చరణ్ బిజీ బిజీ
RRRతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు మెగా హీరో రాంచరణ్.
- By Balu J Updated On - 07:46 PM, Fri - 2 September 22

RRRతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు మెగా హీరో రాంచరణ్. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే భారతీయుడు 2 మళ్లీ తెరపైకి రావడంతో ఆ ప్రభావం చరణ్ సినిమాపై పడనుంది. RC15 షూట్ కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు ఉండటంతో రాంచరణ్ ఖాళీగా ఉండే అవకాశాలున్నాయి. ఈ గ్యాప్ ను భర్తీ చేసేందుకు బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లపై సంతకాలు చేయనున్నట్టు సమాచారం.
ఇప్పుడు రామ్ చరణ్ అడ్వటైజ్ మెంట్ షూట్స్ కోసం ఖాళీ సమాయాన్ని కేటాయిస్తున్నాడు. చరణ్ ఈ మధ్యనే బైక్ తయారీ, ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ కోసం ప్రకటన చేశాడు. తాజాగా మరో యాడ్ ఎండార్స్‌మెంట్ కోసం ఆయన రంగంలోకి దిగినట్లు సమాచారం. చరణ్ త్వరలో కొత్త యాడ్‌ని షూట్ చేయనున్నాడని తెలుస్తోంది. కొన్ని రోజుల్లో ఇది చరణ్ కు మూడో యాడ్. సినిమాలతో బిజీగా ఉండే చరణ్ ఎండార్స్‌మెంట్ ఒప్పందాలతో బిజీగా ఉండటం హాట్ టాపిక్ గా మారింది.
Related News

Sharwanand’s Engagement: రక్షితారెడ్డి తో శర్వానంద్ ఎంగేజ్ మెంట్.. పిక్ వైరల్!
యాక్టర్ శర్వానంద్ (Sharwanand) కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు.