Gautham Raju: విషాదంలో టాలీవుడ్.. ప్రముఖ ఎడిటర్ కన్నుమూత
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.
- Author : Prasad
Date : 06-07-2022 - 8:09 IST
Published By : Hashtagu Telugu Desk
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు (68) కన్నుమూశారు. గౌతమ్‌రాజు గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న(మంగళవారం) ఆయన మరణించారు. గౌతమ్ రాజు మరణ వార్త తెలియగానే చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇటీవల ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. దీనితో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు.
కానీ మంగళవారం ఒక్కసారిగా ఆరోగ్యం విషమించడంతో గౌతమ్ రాజు రాత్రి 1.30 గంటలకు మరణించారు. గౌతమ్ రాజు ఎడిటర్ గా దక్షణాది చిత్రాలతో పాటు హిందీ చిత్రాలకు కూడా పనిచేశారు. తెలుగులో అయితే స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ చిత్రాలకు అయన ఎడిటింగ్ అందించారు. గౌతమ్ రాజు షార్ప్ ఎడిటింగ్ అనేక చిత్రాల విజయాలకు ఉపయోగపడింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు ఆయనకు నివాళ్లు అర్పిస్తున్నారు.