Sivaji : చిత్రసీమలో ఆ ముగ్గురే లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు – శివాజీ సంచలన వ్యాఖ్యలు
Sivaji : టిక్కెట్ రేట్ల వివాదంపై శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలోని అంతర్గత వాస్తవాలను తెలియజేశాయి. "ఇండస్ట్రీలో అందరూ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తారన్నది నిజం కాదు. 95 శాతం మంది సాధారణ జీవితమే గడుపుతారు" అని ఆయన పేర్కొన్నారు
- By Sudheer Published Date - 11:45 AM, Mon - 24 November 25
క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీరంగ ప్రవేశం చేసి, హీరోగా దశాబ్దానికి పైగా ప్రేక్షకులను అలరించిన నటుడు శివాజీ, ఇటీవల ‘కోర్టు’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చి మంగపతి పాత్రలో ఆకట్టుకున్నారు. నటుడిగానే కాకుండా, తన స్పష్టమైన మాటలు మరియు ధైర్యమైన అభిప్రాయాలతో సామాజిక అంశాలు, ప్రజల సమస్యలపై ముందుండి స్పందించే వ్యక్తిగా శివాజీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజాగా, ఐబొమ్మ రవి అరెస్ట్ నేపథ్యం, అలాగే థియేటర్ల టిక్కెట్ ధరలు, పాప్‌కార్న్ రేట్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఐబొమ్మ రవి అరెస్టుపై శివాజీ స్పందిస్తూ, రవి ప్రతిభను అభినందించినప్పటికీ, “దేశ చట్టాలకు వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే శిక్షకు గురికావాలి” అని స్పష్టం చేశారు. అంతేకాక, “ఈ దేశస్థుడు కాదు కాబట్టి శిక్షించలేరు అనడం సరైన ఆలోచన కాదు. చిన్నపాటి నేరాలు చేసే దొంగల్ని కూడా వదిలేయాలా?” అంటూ చట్టం ముందు అందరూ సమానమేనని బలంగా వాదించారు.
Maoist Letter : ఆయుధాలు వీడేందుకు సిద్ధం అంటూ మావోయిస్టులు సంచలన లేఖ
టిక్కెట్ రేట్ల వివాదంపై శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలోని అంతర్గత వాస్తవాలను తెలియజేశాయి. “ఇండస్ట్రీలో అందరూ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తారన్నది నిజం కాదు. 95 శాతం మంది సాధారణ జీవితమే గడుపుతారు” అని ఆయన పేర్కొన్నారు. ఒక హీరో, దర్శకుడు, నిర్మాత మాత్రమే లగ్జరీలో ఉంటే, మొత్తం ఇండస్ట్రీని దోషిగా చూపించడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంక్రాంతి సమయంలో బస్సు రేట్లు మూడు రెట్లు పెరిగినా ఎవరూ మాట్లాడరని, కానీ సినిమా టిక్కెట్ రూ.100 పెంచితే మాత్రం ఇండస్ట్రీనే విలన్‌గా చూపిస్తున్నారని ఉదాహరణ ఇచ్చారు. చిన్న సినిమాల విషయంలో కంటెంట్ బాగుంటే ఆడియన్స్ వస్తున్నారని గుర్తు చేస్తూ, ఇండస్ట్రీలో ఎవరు తప్పు చేశారో వారి గురించి మాత్రమే మాట్లాడాలని, అందరినీ విలన్లుగా చూడటం కరెక్ట్ కాదని హితవు పలికారు.
Surya Kant : ఆనాడు రైతు బిడ్డ ..నేడు CJI..సూర్యకాంత్ జీవన ప్రయాణం ఎందరికో ఆదర్శం
అదేవిధంగా థియేటర్లలో పాప్‌కార్న్ రేట్లపై ఇండస్ట్రీని టార్గెట్ చేయడంపైనా శివాజీ సూటిగా స్పందించారు. కొందరు హీరోలు, ప్రొడ్యూసర్లకు మాల్స్ ఉన్నాయని, అక్కడ పాప్‌కార్న్ రేట్లు భారీగా ఉన్నా, దానికి సినిమాకి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఏఎంబీ మాల్‌లో రేట్లు మరీ దారుణంగా ఉన్నాయని, కానీ రేట్లు తగ్గించమని అడిగితే ‘మా బిజినెస్‌తో మీకు సంబంధం ఏంటి’ అని అడుగుతారని ఆయన అన్నారు. తనపై వచ్చిన పాప్‌కార్న్ కామెంట్ల వివాదంపైనా స్పందిస్తూ, తాను పాప్‌కార్న్ ఆరోగ్యానికి మంచిది కాదని మాత్రమే చెప్పానని, దాన్ని పెద్ద హంగామా చేయడం భావ్యం కాదని అన్నారు. ప్రజా సమస్యలపై ఎన్నో పోరాటాలు చేసిన తనను ఇలా తప్పుగా చూపించడం సరికాదని శివాజీ స్పష్టం చేశారు. టిక్కెట్ రేట్ల విషయంలో కొన్ని మల్టీప్లెక్స్‌లు సహకరించకపోయినా, ఈ విషయంలో మొత్తం ఇండస్ట్రీపై దుష్ప్రచారం చేయడం సరైన దారి కాదని శివాజీ తేల్చి చెప్పారు.