OG Collections: పవన్ కళ్యాణ్ OG విధ్వంసం.. 4 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
విడుదలైన తొలి రోజు నుంచే 'OG' అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. మొదటి వారాంతంలో (4 రోజులు) ఏ మాత్రం తగ్గకుండా కలెక్షన్ల ప్రవాహం కొనసాగింది. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా వంటి అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఈ చిత్రం భారీగా వసూలు చేసింది.
- By Gopichand Published Date - 03:58 PM, Mon - 29 September 25

OG Collections: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలిని తీరుస్తూ, దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో వచ్చిన గ్యాంగ్‌స్టర్ డ్రామా చిత్రం ‘OG’. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ (OG Collections) వద్ద సునామీ సృష్టిస్తోంది. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ చిత్రం, కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 252 కోట్లకు పైగా వసూళ్లను (Worldwide Gross) రాబట్టి, కలెక్షన్ల పరంగా సరికొత్త చరిత్ర సృష్టించింది.
పవన్ కళ్యాణ్ విశ్వరూపం
తొలి రోజు నుంచే రికార్డు స్థాయి ఓపెనింగ్స్‌తో దూసుకుపోయిన ‘OG’, పవన్ కళ్యాణ్ స్టైల్, స్క్రీన్ ప్రజెన్స్, సుజీత్ టేకింగ్ కారణంగా భారీ విజయాన్ని నమోదు చేసింది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాలో పుష్కలంగా ఉండటం, ఈ సినిమాకు తిరుగులేని వసూళ్లు రావడానికి ప్రధాన కారణం.
Also Read: India: ఐసీసీ టోర్నమెంట్ల నుండి టీమిండియాను సస్పెండ్ చేయాలి: పాక్ మాజీ ఆటగాడు
థమన్ మ్యూజిక్ ప్లస్ పాయింట్
‘OG’ విజయంలో సంగీత దర్శకుడు థమన్ పాత్ర కీలకమైంది. ఆయన అందించిన నేపథ్య సంగీతం (BGM) సినిమా స్థాయిని, యాక్షన్ సీక్వెన్స్‌ల ఇంటెన్సిటీని పెంచింది. ముఖ్యంగా ‘OG’ టైటిల్ ట్రాక్, ఇతర పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమా విజయంలో థమన్ మ్యూజిక్ ఒక పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచిందని సినీ విమర్శకులు సైతం అభిప్రాయపడ్డారు.
When cyclone strikes…
Bow down to the tide…
When #OG comes you run and hide!!252Cr+ Worldwide Gross in 4 days 🔥#BoxOfficeDestructorOG #TheyCallHimOG pic.twitter.com/HGo96vPES4
— DVV Entertainment (@DVVMovies) September 29, 2025
రికార్డు వసూళ్ల పరంపర
విడుదలైన తొలి రోజు నుంచే ‘OG’ అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. మొదటి వారాంతంలో (4 రోజులు) ఏ మాత్రం తగ్గకుండా కలెక్షన్ల ప్రవాహం కొనసాగింది. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా వంటి అంతర్జాతీయ మార్కెట్లలోనూ ఈ చిత్రం భారీగా వసూలు చేసింది. నాలుగు రోజుల్లోనే రూ. 252 కోట్లు దాటడం అనేది పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యంత వేగంగా సాధించిన ఘనతగా రికార్డులకెక్కింది. సుజీత్ దర్శకత్వం, పవన్ కళ్యాణ్ అసాధారణమైన స్క్రీన్ ప్రజెన్స్, థమన్ అద్భుతమైన సంగీతం కలగలిసి ‘OG’ని కేవలం నాలుగు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద ఒక సంచలనాత్మక విజయంగా మార్చాయి.