Heroines : ఒకప్పటి హీరోయిన్స్.. వీళ్ళ అసలు పేర్లు ఏంటో తెలుసా..?
వెండితెరపై తమ నటన, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకునే నటీనటులు.. స్క్రీన్ పై తమ అసలు పేరు కాకుండా వేరే పేరుతో ఆడియన్స్ కి పరిచయం అవుతుంటారు.
- By News Desk Published Date - 09:21 PM, Fri - 27 October 23
వెండితెరపై తమ నటన, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకునే నటీనటులు.. స్క్రీన్ పై తమ అసలు పేరు కాకుండా వేరే పేరుతో ఆడియన్స్ కి పరిచయం అవుతుంటారు. ఈక్రమంలోనే శివ శంకర వర ప్రసాద్ చిరంజీవిగా(Chiranjeevi), స్వీటీ శెట్టి అనుష్క(Anushka) శెట్టిగా.. ఇలా ఎంతోమంది ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. వీరి లాగానే ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ శ్రీదేవి(Sridevi), సౌందర్య(Soundarya), జయప్రద(Jayaprada), రంభ.. వంటి తారలు కూడా అసలు పేర్లతో కాకుండా వేరే పేర్లతో ఆడియన్స్ ముందుకు వచ్చారు.
జయసుధ..
సహజ నటిగా పేరుని సంపాదించుకున్న జయసుధ.. 1958 డిసెంబర్ 17న మద్రాసులో జన్మించింది. ఈమె అసలు పేరు సుజాత. 13 ఏళ్ళ వయసులోనే నటిగా కెరీర్ ని స్టార్ట్ చేసింది.
జయప్రద..
తెలుగు, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా చక్రంతిప్పిన జయప్రద 1962 ఏప్రిల్ 3న రాజమండ్రిలో జన్మించింది. 1974లో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన జయప్రద అసలు పేరు లలితారాణి.
శ్రీదేవి..
నాలుగేళ్ళ వయసులోనే నటన మొదలు పెట్టిన అతిలోకసుందరి శ్రీదేవి.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మహారాణిగా వెలిగింది. 1963 ఆగష్టు 13న తమిళనాడులో జన్మించిన శ్రీదేవి.. అసలు పేరు శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్.
జీవితా రాజశేఖర్..
హీరోయిన్గా, దర్శకురాలిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జీవిత.. శ్రీశైలంలో జన్మించింది. ఈమె అసలు పేరు పద్మ. ఇంటిలోని కుటుంబసభ్యులు ఈమెను.. పెద్ద పద్మ, పెద్ద బొట్టు పద్మ అని కూడా పిలిచేవారట.
సౌందర్య..
కన్నడ అమ్మాయి అయినా తెలుగింటి అమ్మాయిగా ప్రతి ఒక్కరికి దగ్గరైన సౌందర్య.. అసలు పేరు సౌమ్య. 1972 జులై 18న జన్మించిన సౌందర్య.. 2004 ఏప్రిల్ 17న విమాన ప్రమాదంలో మరణించింది.
ఆమని..
జంబలకిడిపంబ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన నటి ఆమని. 1973లో నవంబర్ 16న జన్మించిన ఈమె అసలు పేరు మంజుల.
రోజా..
సినీ, రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసుకుంటూ వెళ్తున్న రోజా.. 1972లో నవంబర్ 17న జన్మించింది. ఈమె అసలు పేరు శ్రీలతా రెడ్డి.
రంభ..
1976 జూన్ 5న విజయవాడలో పుట్టిన రంభ.. ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యింది. రంభ అసలు పేరు విజయలక్ష్మి.
రాశి..
బాలనటిగా తెలుగు ఇండస్ట్రీలో యాక్టింగ్ ని మొదలు పెట్టిన రాశి 1980 జులై 29న జన్మించింది. ఈమె అసలు పేరు విజయలక్ష్మి. ఇంటిలో వారు మంత్ర అని కూడా పిలుస్తుంటారట.
భూమిక..
పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్స్ తో నటించిన భూమిక చావ్లా.. 1978 ఆగష్టు 21న జన్మించింది. ఈమె అసలు పేరు రచనా చావ్లా. అయితే ఇంటిలో వారు గుడియా అని కూడా పిలుస్తుంటారట. ఇలా చాలా మంది హీరోయిన్స్ అసలు పేరు కాకుండా పేరు మార్చుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు.
Also Read : Vikram: విక్రమ్ “తంగలాన్” రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే
Related News
Jagadeka Veerudu Athiloka Sundari : ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’కి ముందు అనుకున్న కథ వేరు.. చిరంజీవి మార్చేశారు..
'జగదేకవీరుడు అతిలోకసుందరి'కి ముందు అనుకున్న కథ వేరు. ఆ కథలో చిరంజీవి చేసిన మార్పులు సినిమాకి విజయానికి..