HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >There Will Be No Theater Closure From June 1 Film Chamber

Film Chamber : జూన్‌ 1 నుంచి థియేటర్ల బంద్‌ ఉండదు: ఫిల్మ్‌ ఛాంబర్‌

శనివారం ఫిల్మ్‌ ఛాంబర్‌ కార్యాలయంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య జరిగిన సమావేశం అనంతరం, ఫిల్మ్‌ ఛాంబర్‌ కార్యదర్శి దామోదర ప్రసాద్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో థియేటర్లలో పర్సంటేజ్ విధానం, బిజినెస్ మోడల్‌ మార్పులపై చర్చ జరిగింది.

  • By Latha Suma Published Date - 02:15 PM, Sat - 24 May 25
  • daily-hunt
There will be no theater closure from June 1: Film Chamber
There will be no theater closure from June 1: Film Chamber

Film Chamber : తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1వ తేదీ నుంచి సినిమా థియేటర్లు బంద్ అవుతాయని వస్తున్న వార్తలకు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఓ క్లారిటీ ఇచ్చింది. ఈ విషయంలో ఎటువంటి అపోహలు అవసరం లేదని స్పష్టం చేసింది. శనివారం ఫిల్మ్‌ ఛాంబర్‌ కార్యాలయంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య జరిగిన సమావేశం అనంతరం, ఫిల్మ్‌ ఛాంబర్‌ కార్యదర్శి దామోదర ప్రసాద్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో థియేటర్లలో పర్సంటేజ్ విధానం, బిజినెస్ మోడల్‌ మార్పులపై చర్చ జరిగింది. ఒక్క సినిమాను కేంద్రంగా తీసుకుని థియేటర్ల బంద్‌ చేస్తున్నామనడం సత్యానికి దూరం. చిత్ర పరిశ్రమలో ఎన్నో సమస్యలున్నాయి. అవన్నీ పరస్పర సంబంధాలతో ఉన్న సమస్యలు. వాటిని ఒకదాని తర్వాత ఒకటి చర్చించుకుంటూ పరిష్కరించాలి అని ఆయన అన్నారు.

Read Also: CM Chandrababu : నీతి ఆయోగ్ భేటీలో చంద్రబాబు ప్రసంగం: వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్రపై నివేదిక

చిన్న, మధ్య తరహా సినిమాలు సాగేలా థియేటర్లలో పర్సంటేజ్ వ్యవస్థను అమలు చేయాలన్న డిమాండ్‌ను చర్చలో ప్రస్తావించారని దామోదర ప్రసాద్‌ తెలిపారు. గత కొన్నేళ్లుగా ఈ అంశంపై సమగ్ర చర్చ జరగలేదు. ఇప్పుడైతే ప్రారంభమైంది. దీనిపై మేము రోడ్‌ మ్యాప్‌ రూపొందిస్తాం. థియేటర్లు, డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్‌ వర్గాల నుంచి సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఈ కమిటీ జూన్ 30న జరిగే తదుపరి సమావేశంలో ఖరారు చేస్తాం అన్నారు. థియేటర్ల బంద్ గురించి వస్తున్న వదంతులను కొట్టి పారేశారు. థియేటర్ల బంద్ అనే ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు. ఫిల్మ్‌ ఛాంబర్‌ లేదా దాని అధికార ప్రతినిధుల నుంచి వచ్చే సమాచారం తప్ప మరేదీ ప్రామాణికం కాదు. కొన్ని మీడియా సంస్థలు వ్యక్తిగత అభిప్రాయాలతో వార్తలు ప్రసారం చేస్తుంటే, అవి పరిశ్రమకు నష్టం కలిగించేలా మారుతున్నాయి అన్నారు.

చిత్ర పరిశ్రమలో అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు సాగాలనే మా ఉద్దేశ్యం. ఎలాంటి సమస్యలైనా సంయమనంతో, చర్చలతో పరిష్కరించేందుకు ఫిల్మ్‌ ఛాంబర్‌ సిద్ధంగా ఉంది. కొన్ని సమస్యలను ప్రభుత్వం స్థాయిలో చర్చించి పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం త్వరలోనే ఏపీ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్‌ను కలవాలని ప్లాన్ చేస్తున్నాం. అతనికి పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించనున్నాం అని వెల్లడించారు. చిత్ర పరిశ్రమలో తలెత్తుతున్న వివిధ సమస్యలపై పరిశీలన చేపట్టేలా, మూడు విభాగాలనుంచి ఏర్పడే కమిటీ సిఫార్సులను అనుసరిస్తామని తెలిపారు. వాస్తవాలు, పరిశ్రమలో మారుతున్న పరిణామాలు అన్నీ పరిగణనలోకి తీసుకుని ముందడుగు వేయాలి. ఈ మార్పులు చిన్న సినిమాలకు అనుకూలంగా ఉండేలా చూసుకుంటాం అన్నారు. అంతేకాక, ఇప్పటి వరకు జరిగిన ప్రచారాలన్నీ అపార్థాలు. పరిశ్రమలో ఏ అంశమైనా అధికారికంగా ప్రకటించేది ఫిల్మ్‌ ఛాంబర్‌ మాత్రమే. తప్పితే ప్రజలకు భ్రాంతులు కలిగే ప్రమాదం ఉంది అంటూ మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఇటువంటి సమావేశాలు పరిశ్రమను సమగ్రంగా ముందుకు తీసుకెళ్లే దిశగా కీలకంగా నిలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. “మేము కలసికట్టుగా పనిచేస్తాం. ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి ముందు వేదికగా ఫిల్మ్‌ ఛాంబర్‌ నిలుస్తుంది అని స్పష్టం చేశారు.

Read Also: Keshava Rao Encounter : మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్‌కౌంట‌ర్‌‌పై అనుమానాలివీ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • distributors
  • exhibitors
  • film chamber
  • producers
  • Theatres bandh

Related News

    Latest News

    • Khairatabad Ganesh : గంగమ్మ ఒడికి బయలుదేరిన ఖైరతాబాద్ మహాగణపతి

    • Trade War : భారత్‌పై అమెరికా వాణిజ్య కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు

    • Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్‌ ద్వివేదీ

    • SIIMA 2025 : సైమా అవార్డ్స్ లో దుమ్ములేపిన పుష్ప 2 ..అవార్డ్స్ మొత్తం కొట్టేసింది

    • Ganesh Immersion : బై బై గణేశా.. నేడే మహానిమజ్జనం

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd