Allu Arjun: ఆస్కార్ పై స్పందించిన స్టైలిష్ స్టార్…ట్వీట్ వైరల్!
ఆస్కార్ సాధించటమనేది ప్రతి ఆర్టిస్ట్ కలగా ఉంటుంది. ఇక ఇండియన్ మూవీ ఆస్కార్ సాధించడం అనేది ఓ కల. ఆ కలను ఆర్‌ఆర్‌ఆర్ మూవీతో రాజమౌళి నెరవేర్చాడు.
- By Nakshatra Published Date - 07:06 PM, Tue - 14 March 23

Allu Arjun: ఆస్కార్ సాధించటమనేది ప్రతి ఆర్టిస్ట్ కలగా ఉంటుంది. ఇక ఇండియన్ మూవీ ఆస్కార్ సాధించడం అనేది ఓ కల. ఆ కలను ఆర్‌ఆర్‌ఆర్ మూవీతో రాజమౌళి
నెరవేర్చాడు. విశ్వవేదిక అకాడమీ అవార్డ్స్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా ఆర్‌ఆర్‌ఆర్‌లోని నాటు నాటు పాట ఆస్కార్ దక్కించుకుంది. ఒక ఇండియన్ సినిమా ఆస్కార్ బరిలో నామినేషన్‌లో ఉండటమే కాకుండా అవార్డ్ సైతం గెలుచుకుంది. ఇక రాజమౌళి టీమ్ చరిత్ర సృష్టించటమే కాదు. దేశానికి ప్రతిష్టాత్మకమైన అవార్డ్ సాధించి పెట్టిందని టీటౌన్ సంబరాలతో మోత మోగిపోయింది.
టాలీవుడ్ అగ్రహీరోలతో పాటు యంగ్ హీరోలందరూ సోమవారమే ట్వీటర్ వేదికగా ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ కు విషెస్ తెలిపారు. కానీ అల్లుఅర్జున్ మాత్రం ఒక్క రోజు
ఆలస్యంగా ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ కు విషెస్ చెప్పారు. ఇండియన్ సినిమాకు ఇది హార్ట్ టచింగ్ మూమెంట్ అంటూ అల్లుఅర్జున్ ట్వీ ట్ చేశారు. అలాగే రామ్ చరణ్ ను లవ్లీ బ్రదర్ అంటూ ఎన్టీఆర్ తెలుగు ప్రజల గర్వకారణం అని పేర్కొన్నారు. వాళ్ళి ద్దరూ తమ స్టెప్పులతో ప్రపంచమంతా డ్యాన్స్ చేసేలా చేశారని పోస్టులో రాసుకొచ్చాడు.
ప్రస్తుతం అల్లుఅర్జున్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఒక తెలుగు సినిమాకు ఆస్కార్ వస్తే, ఇంత ఆలస్యంగా ట్వీ ట్ చేస్తారా అని కొంతమంది నెటిజన్స్ బన్నీపై ఫైర్ అవుతుంటే, షూటింగ్‌లో బిజీగా ఉండడం వల్ల బన్నీ లేట్‌గా స్పందించి ఉంటారని ఫ్యా న్స్ చెబుతున్నారు. అంతేకాదు ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు.

Related News

Natu Natu Dance by Puppet: ‘నాటు నాటు’ పాటకు కు డ్యాన్స్ అదరగొట్టిన తోలుబొమ్మ..!
‘నాటు నాటు’ పాట స్థాయి ఆస్కార్ అవార్డుతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ అయింది. దేశ సరిహద్దులతో సంబంధం లేకుండా, సామాన్యులు, సెలబ్రిటీలు అనే వ్యత్యాసం