The Raja Saab : రేపు సాయంత్రం ‘రాజాసాబ్’ ట్రైలర్
The Raja Saab : పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులకు ఈ దసరా పండుగ మరింత ఆనందంగా మారనుంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రాజాసాబ్’ (The Raja Saab) సినిమా ట్రైలర్‌ను రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు
- By Sudheer Published Date - 01:05 PM, Sun - 28 September 25

పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులకు ఈ దసరా పండుగ మరింత ఆనందంగా మారనుంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రాజాసాబ్’ (The Raja Saab) సినిమా ట్రైలర్‌ను రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘భయానికి ద్వారాలు తెరుచుకున్నాయి… ధైర్యముంటే ఎంటర్ అవ్వండి’ అంటూ వారు ట్వీట్ చేయడం ద్వారా సినిమాపై ఉత్కంఠను మరింత పెంచేశారు. ఈ వార్తతో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు జరుపుకుంటున్నారు.
హారర్ డ్రామా జానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రభాస్ కెరీర్‌లో ప్రత్యేకమైన స్థానం సంపాదించనుందనే అంచనాలు ఉన్నాయి. యాక్షన్, థ్రిల్లర్, రొమాన్స్ వంటి విభిన్న జానర్స్‌లో ఇప్పటికే తనదైన ముద్ర వేసుకున్న ప్రభాస్, ఈసారి భయానక అంశాలతో కూడిన కథలో ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. ‘రాజాసాబ్’లోని కథాంశం, ప్రభాస్ గెట్‌అప్, విజువల్స్ గురించి ఇప్పటివరకు పెద్దగా లీక్ అవ్వకపోవడంతో ట్రైలర్ రిలీజ్ పై ఆసక్తి మరింతగా పెరిగింది.
ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు మారుతీ (Maruthi) హ్యాండిల్ చేస్తున్నారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌లో తనకంటూ ప్రత్యేక శైలి ఉన్న మారుతీ, ఈసారి హారర్ డ్రామాలో కొత్త మూడ్ సృష్టించబోతున్నారని సినీ వర్గాలు అంటున్నాయి. దసరా సీజన్‌లో ట్రైలర్ రిలీజ్ చేయడం కూడా వ్యూహాత్మకమే అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పండుగ సీజన్ హైప్ తో పాటు ప్రభాస్ స్టార్‌డమ్ కలిస్తే సినిమా పై అంచనాలు మరింతగా పెరుగుతాయని మేకర్స్ భావిస్తున్నారు.