HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >The Last Moments Of Taraka Ratna Death Are Like This

Taraka Ratna Last Moments: తారకరత్న మరణం చివరి క్షణాలు ఇలా..

తారకరత్న శనివారం సాయత్రం 4.10 గంగలకు తుది శ్వాస విడిచారని టీడీపీ (TDP) వర్గాల్లోని సమాచారం.

  • Author : Maheswara Rao Nadella Date : 19-02-2023 - 6:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
The Last Moments Of Taraka ratna Death Are Like This
The Last Moments Of Tarakaratna Death Are Like This

తారకరత్న (Taraka Ratna) శనివారం సాయత్రం 4.10 గంగలకు తుది శ్వాస విడిచారని టీడీపీ వర్గాల్లోని సమాచారం. కుటుంబ సభ్యులకు ఒక్క సారిగా చెప్పలేని పరిస్థితుల్లో బాలకృష్ణ కు ముందుగా సమాచారం అందించి ఆ తరువాత చంద్రబాబుతో సహా కుటుంబంలోని ఇతరులకు చెప్పారు. హైదారాబాద్ కు తరలించే క్రమంలో తారకరత్న ఇక లేరనే విషయం బయటకు వచ్చింది. బెంగుళూరు నుంచి అంబులెన్సులో తారకరత్న భౌతిక కాయాన్ని హైదరాబాద్ కు తరలించారు. అప్పటి వరకు ఆస్పత్రిలోనే ఉన్న తారకరత్న సతీమణి, కుటుంబ సభ్యులు ఒక్క సారిగా షాక్ కు గురయ్యారు. వారికి బాలకృష్ణ ధైర్యం చెప్పారు. సోమవారం తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి.

కుప్పంలో లోకేష్ యువగళం ప్రారంభం రోజు గుండెపోటుకు గురైన తారకరత్నకు అక్కడే తొలుత ప్రాధమిక చికిత్స చేసారు. ఆ సమయంలో చికిత్స బాధ్యతలను నందమూరి బాలకృష్ణ పర్యవేక్షించారు. హైదరాబాద్ వైద్యులతో మాట్లాడిన తరువాత బెంగుళూరు నారాయణ హృదయాలయకు తరలించారు. నారాయణ హృదయాలయ వైద్యులతో మాట్లాడి నిపుణుల టీంతో ఉన్న అంబులెన్సును కుప్పంకు రప్పించారు. కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయటంతో అంబులెన్సు ద్వారా కుప్పం నుంచి బెంగళూరు నారాయణ హృదయాలయ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో గుండెకు సంబంధించి ఎటువంటి సమస్య లేదని తేల్చారు. కానీ, గుండెపోటు వచ్చిన సమయంలో మెదడుకు నష్టం జరిగిందని గుర్తించారు. మెదడు లో వాపు ఉందని, తగ్గితేనే చికిత్స పూర్తవుతుందని వైద్యులు వెల్లడించారు

తారకరత్న (Taraka Ratna) 23 రోజుల పాటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడారు. విదేశీ వైద్యుల టీం ప్రతీ క్షణం పర్యవేక్షణ చేస్తూ చికిత్స అందించింది. కానీ,శనివారం ఉదయం నుంచే తారకరత్న ఆరోగ్యం తీవ్ర విషమంగా మారింది. వెంటనే కుటుంబ సభ్యులకు వైద్యలు సమాచారం ఇచ్చారు. తొలి నుంచి తారకరత్న ఆరోగ్యం గురించి పర్యవేక్షిస్తున్న నందమూరి బాలకృష్ణతో మాట్లాడారు. పరిస్థితి వివరించారు. వెంటనే బాలకృష్ణతో పాటుగా మరి కొందరు ఆస్పత్రికి చేరుకున్నారు. రాత్రికి తారకరత్న మరణించినట్లు న్యూస్ బయటకు వచ్చింది. కానీ, తారకరత్న సాయంత్రమే మరణించినట్లుగా సమాచారం తెలుస్తోంది. నారాయణ హృదయాలయ హాస్పిటల్ వైద్యులు చివరి నిమిషం వరకు తారకరత్నను సేవ్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు.

నారాయణ హృదయాలయ వైద్యులతో బాలకృష్ణ తో పాటుగా కర్ణాటక మంత్రి సుధాకర్ చర్చల తరువాత విదేశీ వైద్యులను రప్పించారు. తారకరత్నకు చికిత్స చేయించారు. నిత్యం పరీక్షలు చేస్తూనే చేశారు. మెదడు సంబంధింత సమస్యలో మాత్రం మార్పు రాలేదు. తారకరత్న కోమాలోనే ఉన్నా, ఇతర అవయవాల పని తీరు బాగానే ఉందని పరీక్షల్లో తేలింది. కానీ, శుక్రవారం రాత్రి నుంచి ఆరోగ్యంలో మార్పు కనిపించిందని సమాచారం. శనివారం ఉదయానికి మరింతగా పరిస్థితి విషమించింది. వైద్యుల సమాచారంతో మధ్నాహ్నాం సమయానికి బాలకృష్ణ .కుటుంబ సభ్యు లు ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యులు తారకరత్న పరిస్థితిని వివరించారు. అప్పటికే విషమంగా మారిందని తెలుస్తుంది.

Also Read:  AP Politics: జగన్ మరో ఛాన్స్ కోసం కేసీఆర్ వ్యూహం! పవన్ పై బీఆర్ఎస్ నీడ!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • cinema
  • Entertainment
  • Last Moments
  • movie
  • political
  • Tarakaratna

Related News

Nara Bhuvaneshwari Anna Canteens

Nara Bhuvaneswari: అన్న క్యాంటీన్‌లో పేదలతో కలిసి చంద్రబాబు,భువనేశ్వరి అల్పాహారం

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు సందర్భంగా అన్నా క్యాంటీన్లకు నారా భువనేశ్వరి రూ.76 లక్షలను విరాళంగా ఇచ్చారు. ఉదయాన్నే చంద్రబాబుతో కలిసి అన్నా క్యాంటీన్‌కు వెళ్లిన ఆమె.. అక్కడికి వచ్చిన వారికి అల్పాహారం వడ్డించడంతోపాటు.. వారితో కలిసి స్వయంగా ఆహారం తీసుకున్నారు. తద్వారా పుట్టిన రోజులు, పెళ్లి రోజు వంటి ప్రత్యేక రోజుల్లో అందరూ అన్నదానానికి తమకు తోచిన మొత్తం వ

  • Simhachalam Chandanotsavam Simhadri Appanna Darshanam

    Simhachalam Chandanotsavam : నేడు సింహాద్రి అప్పన్న చందనోత్సవం

  • PM Modi wishes Andhra Pradesh CM Chandrababu Naidu

    చంద్రబాబుకు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్

  • Nara Lokesh garu met Punarvika's family after she received an injection today

    Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

  • Amaravati Farmers

    Amaravati: రైతులకు గుడ్ న్యూస్.. రూ. 1.50 లక్షల రుణ మాఫీ – చంద్రబాబు

Latest News

  • KCR Meeting In Jagtial : కెసిఆర్ సభకు హరీష్ రావు దూరం !!

  • Airlines Plane : 4 గంటలు ప్రయాణికులకు నరకం చూపించిన ఎయిర్లైన్స్ విమానం

  • Mango : మామిడి తోటకు సెక్యూరిటీ గార్డులతో భారీ సెక్యూరిటీ.. ఎందుకో తెలుసా ?

  • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

  • IPL 2026 : RR ఓటమిని తట్టుకోలేక ఎక్కి ఎక్కి ఏడ్చిన వైభవ్

Trending News

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

    • నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd