Thandel OTT: నాగచైతన్య తండేల్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అయ్యేది అప్పటి నుంచే?
ఇటీవల నాగచైతన్య హీరోగా నటించిన తండేల్ సినిమా ఇప్పుడు ఓటీటీ విడుదల అవడానికి సిద్ధంగా ఉంది. తాజాగా మూవీ మేకర్స్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.
- By Anshu Published Date - 09:03 AM, Mon - 3 March 25

టాలీవుడ్ అక్కినేని హీరో నాగచైతన్య, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి కలిసి నటించిన చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.. ప్రస్తుతం మూవీ మేకర్స్ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా 100 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్ ను సాధించిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లోకి విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ఇంతకీ ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతోంది అన్న వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళంలోని ఒక మత్స్యకారుల కుటుంబానికి చెందిన వ్యక్తి రాజు (నాగ చైతన్య). తన స్నేహితురాలు సత్య అలియాస్ బుజ్జితల్లి (సాయి పల్లవి). చిన్నతనం నుంచి ఒకరంటే మరొకరికి ఇష్టం. ప్రతీ ఏడాది రాజు వేటకు వెళ్లి కొన్ని నెలల పాటు సముద్రంలో ఉండాల్సి వస్తుంది. ఈ సారీ వేట నుంచి రాగానే వివాహం చేసుకోవాలనుకుంటారు ఈ జంట.
కానీ ఒక రోజు భారీ తుపానులో చిక్కుకున్న రాజు అతని బృందం భారతీయ సరిహద్దులు దాటి పాకిస్థాన్‌లోకి ప్రవేశిస్తారు. ఆ తర్వాత వీళ్ల ప్రేమ కథ ఏ తీరం చేరిందో తెలియాలంటే తండేల్ సినిమా చూడాల్సిందే. అయితే థియేటర్లలో విడుదలై అలరించిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ వేదికగా మార్చి 7నుంచి ప్రసారం కానున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే.