Game Changer : గేమ్ ఛేంజర్ కి మొత్తం ఎన్ని కోట్ల లాస్ వచ్చిందో చెప్పేసిన తమన్..
సినిమా యావరేజ్ గా నిలిచినా కొంతమంది కావాలని గేమ్ ఛేంజర్ పై నెగిటివిటి తెచ్చారు.
- By News Desk Published Date - 08:02 AM, Wed - 16 April 25

Game Changer : శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు భారీగా ఖర్చుపెట్టి తెరకెక్కించిన సినిమా గేమ్ ఛేంజర్. అనుకోని కారణాల వల్ల , శంకర్ మధ్యలో వేరే సినిమా చేయడం వల్ల ఈ సినిమా చాలా ఆలస్యం అయింది. ఇటీవల సంక్రాంతికి రిలీజయింది ఈ సినిమా. అయితే సినిమా యావరేజ్ గా నిలిచినా కొంతమంది కావాలని గేమ్ ఛేంజర్ పై నెగిటివిటి తెచ్చారు.
ఓ ఇద్దరు హీరోల ఫ్యాన్స్, ఓ రాజకీయ పార్టీ వ్యక్తులు, మెగా ఫ్యామిలీ అంటే గిట్టని వాళ్ళు ఈ సినిమాని పైరసీ చేయడం, బస్సుల్లో, లోకల్ టీవీల్లో టెలికాస్ట్ చేయడం, మూవీ యూనిట్ ని పైరసీ చేస్తామని బెదిరించడం, సినిమా డిజాస్టర్ అంటూ రిలీజ్ కి ముందే ట్విట్టర్లో ట్రెండ్ చేయడం చేసారు. దీంతో ఈ సినిమాకు భారీగా డ్యామేజ్ జరిగింది. పోలీసులు కూడా రంగంలోకి దిగే అంత డ్యామేజ్ చేసారు.
ఈ సినిమాని దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారని సమాచారం. అయితే ఈ సినిమాకు వచ్చిన నెగిటివిటి చూసి అప్పుడే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్లో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీని గురించి మరోసారి స్పందించాడు.
తమన్ మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్ సినిమాకు కావాలని నెగిటివిటి చేసారు అనిపించింది. సినిమా రిలీజ్ అవ్వకముందే డిజాస్టర్ అని ట్రెండ్ చేయడం, సినిమాని పైరసి చేయడం చాలా బాధ అనిపించింది. అప్పుడు దిల్ రాజు గారికి ఎవరూ సపోర్ట్ గా నిల్చోలేదు అందుకే అలా మాట్లాడాను. దిల్ రాజు గారు శంకర్, రామ్ చరణ్ తో ఒక మంచి సినిమా తీసి ఓ 1000 కోట్లు కలెక్ట్ చేయాలనీ అనుకున్నారు. అది తప్పు కాదు. సినిమా బాగోకపోతే అదే పోతుంది. కానీ సినిమాని కావాలని చంపేశారు. ఆ సినిమాకు 140 కోట్ల నష్టం వచ్చింది. అంత భారీ నష్టం అంటే ఏ నిర్మాతకు అయినా కష్టమే. దిల్ రాజు లాంటి మంచి మనిషికి అంత నష్టం రావడం బాధేసింది. పైరసికి వ్యతిరేకంగా టాలీవుడ్ తో పాటు అందరి హీరోల ఫ్యాన్స్ ఒక్కటి అవ్వాలి అని అన్నారు.
దీంతో గేమ్ ఛేంజర్ సినిమాకు ఓవరాల్ గా 140 కోట్ల దాకా నష్టం వచ్చినట్టు తమన్ తెలిపాడు. థియేట్రికల్ గా ఈ సినిమా సంక్రాంతి సీజన్లో వచ్చింది కాబట్టి ఓ 200 కోట్లు కలెక్ట్ చేసిందని సమాచారం. అలాగే ఓటీటీ నుంచి కూడా కాస్త ఎక్కువే అమౌంట్ రావడం వల్ల 140 కోట్ల దగ్గర నష్టం ఆగింది లేకపోతే ఇంకా ఎక్కువే నష్టం వచ్చేదని భావిస్తున్నారు.
Also Read : Miss And Mrs Strong: మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ బ్యూటిఫుల్ సీజన్ 2 పోస్టర్ ఆవిష్కరణ!