Thaman : అఖండ 2 కి అతను దూరమా.. అర్రె ఆ మ్యాజిక్ మిస్ అవుతామే..?
స్కంద సినిమా విషయంలో బోయపాటికి, థమన్ (Thaman) కు కొంత డిస్ట్రబెన్స్ వచ్చిందట. అందుకే అఖండ 2కి థమన్ ని తీసే అతని ప్లేస్ లో యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్
- Author : Ramesh
Date : 24-07-2024 - 10:38 IST
Published By : Hashtagu Telugu Desk
Thaman నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) బోయపాటి శ్రీను ఈ కాంబినేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బాలయ్య కు ఎలాంటి సినిమా చేస్తే ఆడియన్స్ విజిల్స్ వేస్తారో అలాంటి కథతోనే అలాంటి విజువల్స్ తో బోయపాటి శ్రీను సినిమాలు చేస్తాడు. ఆయన డైరెక్షన్ ఫోర్స్ కేవలం బాలయ్యకు మాత్రమే సూట్ అవుతుందని చెప్పొచ్చు. ఈ ఇద్దరు కలిసి చివరగా అఖండ సినిమా చేయగా త్వరలో అఖండ 2ని సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నారు. అఖండ 2 సినిమా డిసెంబర్ లో మొదలవుతుందని తెలుస్తుంది.
ఐతే ఈ సినిమా క్రూ లో కొన్ని మార్పులు చేస్తున్నట్టు తెలుస్తుంది. అఖండ 2 (Akhanda 2) సినిమా కు మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ఫిక్స్ అనుకుంటుండగా థమన్ ని కాదని మరో మ్యూజిక్ డైరెక్టర్ తో పనిచేయాలని నిర్ణయించుకున్నాడట బోయపాటి శ్రీను. అలా ఎందుకు అంటే స్కంద సినిమా విషయంలో బోయపాటికి, థమన్ (Thaman) కు కొంత డిస్ట్రబెన్స్ వచ్చిందట. అందుకే అఖండ 2కి థమన్ ని తీసే అతని ప్లేస్ లో యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.
అఖండ సినిమాకు థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి స్పెషల్ గా చెప్పుకున్నారు. మరి అలాంటిది ఆ సినిమా సీక్వెల్ లో థమన్ ని కాకుండా మరో మ్యూజిక్ డైరెక్టర్ ని పెట్టడం కాస్త షాకింగ్ గానే ఉంది. మరి ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాలి అంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.
థమన్ కూడా వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఒకవేళ దాని వల్ల ఏమైనా ఈ ఆఫర్ వదులుకున్నాడేమో కానీ అఖండ 2 మాత్రం థమన్ చేస్తేనే బాగుంటుందని నందమూరి ఫ్యాన్స్ కూడా అంటున్నారు. మరి ఈ విషయంలో నిర్ణయం మార్చుకునే ఛాన్స్ ఉందా లేదా అన్నది చూడాలి.
Also Read : KGF Third Part : కె.జి.ఎఫ్ 3 హీరో మారుతున్నాడా.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?