OG First Single : ‘ఓజీ” ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన తమన్
OG First Single : పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ సెట్స్‌లో అడుగుపెట్టిన రోజే ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌గా ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయనున్నట్టు తెలిపారు
- By Sudheer Published Date - 01:09 PM, Wed - 16 April 25

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఓజీ’ (OG)సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి యువ డైరెక్టర్ సుజీత్ (Sujeeth) దర్శకత్వం వహిస్తున్నాడు. స్టైలిష్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీకి సంగీత దర్శకుడిగా తమన్ (Thaman) పని చేస్తున్నారు. తాజాగా తమన్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ గురించి ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు.
Virat Kohli: ఆ విషయంపై తొలిసారి మౌనం వీడిన విరాట్ కోహ్లీ!
తమన్ చెప్పిన వివరాల ప్రకారం.. పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ సెట్స్‌లో అడుగుపెట్టిన రోజే ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌గా ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయనున్నట్టు తెలిపారు. ముందుగా ఈ పాటను విడుదల చేయాలనుకున్నా, కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. త్వరలో పవన్ షూటింగ్లో మళ్లీ జాయిన్ అవుతారనీ, ఆ సందర్భంగా పాటను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
Sravan Rao : నాలుగోసారి సిట్ విచారణకు హాజరైన శ్రవణ్‌రావు
ఇదిలా ఉంటే.. ‘ఓజీ’ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తయిందని తమన్ పేర్కొన్నారు. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫస్ట్ సింగిల్.. పవన్ మాస్ యాటిట్యూడ్‌కి తగ్గట్లుగా పవర్‌ఫుల్ మ్యూజిక్‌తో అందుబాటులోకి రానుంది. మేకర్స్ నుంచి త్వరలోనే అధికారిక విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ మూవీ లో పవన్ కల్యాణ్ ‘ఓజాస్ గంభీర’ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన్ని ఢీకొట్టే ప్రతినాయకుడిగానే బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ నటిస్తున్నారు. యుంగ్ బ్యూటీ ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. వింటేజ్ నటి శ్రియా రెడ్డి కీలక పాత్ర పోషిస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2025 ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.