Chandoo Sai: అబ్బాయిలకు నా జీవితం గుణపాఠం కావాలి.. యూట్యూబర్ చందు సాయి కామెంట్స్ వైరల్?
- By Sailaja Reddy Published Date - 11:00 AM, Fri - 23 February 24

తెలుగు ప్రేక్షకులకు యూట్యూబర్ చందు సాయి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తరచూ యూట్యూబ్లో ఫాలో అయ్యే వారికి చందు సాయి సుపరిచితమే. యూట్యూబ్లో షార్ట్ ఫిలింలు వీడియోలు కామెడీ వీడియోలు చేస్తూ ఎంతోమంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. చందు సాయికి సోషల్ మీడియాలో బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇకపోతే గత ఏడాది చందు సాయి లైంగిక దారి ఆరోపణలు ఎదుర్కోవడంతో పాటు జైలుకు వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. ఒక యువతిని చందు సాయి తన పుట్టిన రోజు వేడుకకు ఆహ్వానించి ఆమె పై లైంగిక దాడికి పాల్పడినట్లు కేసు నమోదు చేశారు.
ఈ కేసుతో జైలుకి వెళ్లిన చందు సాయి దాదాపు నెల రోజులు పాటు జైలులో ఉండి, రీసెంట్ గా బెయిల్ పై బయటకు వచ్చాడు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో కొనసాగుతుంది. ఇక బెయిల్ పై వచ్చిన చందు.. మళ్ళీ తన లైఫ్ ని రీ స్టార్ట్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈక్రమంలోనే రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో చందు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. తాను అసలు ఏ తప్పు చేయలేదని, తనని తప్పు వ్యక్తిగా చూడదని పేర్కొన్నారు. అత్యాచారాలు నేను ఎందుకు చేస్తాను. ఆ అమ్మాయి నేను కలిసి సహజీవనం చేసాము. ఆ రిలేషన్ ని కాపాడుకోవాలనే అనుకున్నాను. కానీ వర్క్ అవుట్ అవ్వలేదు, విడిపోయాము.
అయితే నేను అనుకోని విధంగా వాళ్ళు నా పై కేసు పెట్టారు. అసలు ఏం జరుగుతుందో తెలిసేలోపే అంతా జరిగిపోయింది. నాతో పాటు నా కుటుంబసభ్యుల పై కూడా కేసులు పెట్టారు. ఒకరి పై కోపాన్ని మరి ఇంతలా తీర్చుకుంటారా అని బాధ వేసింది. జైలుకి వెళ్లిన మూడు రోజులు బాగా ఏడ్చాను. కానీ నిజం ఏంటో నాతో ఉన్నవారికి తెలుసని ధైర్యం తెచ్చుకున్నాను. నా ఫ్యామిలీ నాకు అండగా నిలిచింది. ప్రస్తుతం కేసు కోర్టులో నడుస్తుంది. త్వరలో నిజానిజాలు అందరికి తెలుస్తాయి. ఇక నా జీవితం అబ్బాయిలందరికి గుణపాఠం కావాలి. అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండండి. సహజీవనం లాంటివి పెట్టుకోకండి. ఎందుకంటే తప్పు జరిగితే దెబ్బ అబ్బాయిలకే పడుతుంది అంటూ చందు సాయి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.