Odela Railway Station: తెలుగు ప్రేక్షకులు మెచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్’
తెలుగు ప్రేక్షకులు ఓదెల రైల్వే స్టేషన్‌ని మెచ్చుకున్నారు.
- By Balu J Published Date - 04:25 PM, Sat - 27 August 22

తెలుగు ప్రేక్షకులు ఓదెల రైల్వే స్టేషన్‌ని మెచ్చుకున్నారు. కన్నడ సినిమాలతో ఆకట్టుకుంటున్న వశిష్ట సింహ ‘ఓదెల రైల్వే స్టేషన్’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం OTT విడుదలైంది. మంచి రివ్యూస్ తో స్ట్రీమింగ్ అవుతోంది. ఓదెల రైల్వే స్టేషన్‌లోని ధోబీగా తిరుపతి అనే పాత్రలో కనిపిస్తాడు వశిష్ట. అతని నటనకు ప్రశంసలు అందుతున్నాయి. సినిమాలో ప్రతినాయకుడిగా, కథానాయకుడిగా నటిస్తున్నాడు. అందాలు ఆరబోసే హెబ్బా పటేల్ ఈ మూవీలో డీగ్లామర్ గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఒదెలా రైల్వే స్టేషన్ మూవీ కరీంనగర్‌లో జరిగిన వాస్తవ కథల ఆధారంగా నిర్మించబడింది. సుద్దాల అశోక్ తేజ, సాయి రోనక్, హెబ్బా పటేల్, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రధారులుగా నటించారు.