OG కి బిగ్ షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు…టికెట్స్ కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏంటి..?
OG : తెలంగాణలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "ఓజీ" (OG) సినిమా విడుదలకు ముందే పెద్ద షాక్ తగిలింది. ప్రభుత్వం జారీ చేసిన బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు అంశాలపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు వెంటనే స్పందించి ఆ జీవోను సస్పెండ్ చేసింది.
- By Sudheer Published Date - 04:27 PM, Wed - 24 September 25

తెలంగాణలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “ఓజీ” (OG) సినిమా విడుదలకు ముందే పెద్ద షాక్ తగిలింది. ప్రభుత్వం జారీ చేసిన బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు అంశాలపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు వెంటనే స్పందించి ఆ జీవోను సస్పెండ్ చేసింది. దీంతో ఈరోజు రాత్రి జరగాల్సిన ప్రీమియర్స్, రేపటి ఉదయం ప్లాన్ చేసిన బెనిఫిట్ షోలు అన్నీ అయోమయంలో పడిపోయాయి. ముఖ్యంగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన స్పెషల్ షోలు రద్దు కావడం వల్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Railway Employees: రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. బోనస్ ప్రకటించిన కేంద్రం!
ఇక ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకుల పరిస్థితి క్లిష్టంగా మారింది. రేపటి వరకు దాదాపుగా అన్ని షోలు సొల్డ్ అవుట్ అయిన పరిస్థితుల్లో, పెరిగిన రేట్లకు టికెట్లు కొనుగోలు చేసిన వారికి రిఫండ్ ఇస్తారా? లేక సాధారణ ధరకు టికెట్లను కన్వర్ట్ చేస్తారా? అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. థియేటర్ యాజమాన్యాలు, బుకింగ్ ప్లాట్‌ఫాంలు ఈ విషయంలో తుది నిర్ణయం కోసం ప్రభుత్వాన్ని, కోర్టు ఆదేశాలను ఎదురుచూస్తున్నాయి. ఈ లోగా టికెట్ కొనుగోలు చేసిన వేలాది మంది అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు.
సినిమా బిజినెస్ పరంగా కూడా ఈ తీర్పు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. బెనిఫిట్ షోలు ద్వారా వచ్చే కలెక్షన్స్ భారీగా తగ్గిపోనున్నాయి. పైగా టికెట్ రేట్లు సాధారణ స్థాయిలో ఉండటం వల్ల డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు ఆర్థిక నష్టం కలగనుంది. అభిమానులు మాత్రం సినిమా రిలీజ్‌కు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాధారణంగా ప్రదర్శించాలని కోరుతున్నారు. మొత్తానికి హైకోర్టు తీర్పు చిత్ర యూనిట్ తో పాటు అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. అటు ఏపీలో మాత్రం బెనిఫిట్ షోస్ , ప్రీమియర్ షోస్ పడబోతున్నాయి.